గ్రహాంతర అన్వేషణ కోసం నాసా ఉపయోగించే వాహనాలు
కార్లు కేవలం భూగ్రహంపై తిరగటానికి మాత్రమే తయారు చేయబడ్డాయి అనుకుంటే పొరపాటే. అంతరిక్షంలో ఉండే వివిధ గ్రహాలపై తిరిగేందుకు కూడా మన శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు కార్లను, వాహనాలను తయారు చేశారు. అలాంటి కొన్ని స్పేస్ కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్) వివిధ గ్రహాలపై ఉపయోగించేందుకు కొన్ని స్పేస్ కార్లను తయారు చేసింది. అంతేకాదు, ఇప్పటికే ఓ అత్యంత అధునాతమైన రోవింగ్ వెహికల్‌ను అంగాకరక గ్రహం (మార్స్) పైకి పంపించింది.

అంతరిక్షంలోని వివిధ గ్రహాలపై సంచరించేందుకు నాసా గతంలో తయారు చేసిన, ప్రస్తుతం తయారు చేస్తున్న కొన్ని స్పేస్-మొబైల్స్‌ను ఈ కథనంలో చూద్దాం రండి..!

అపోలో లూనార్ రోవింగ్ వెహికల్
అమెరికా కన్నా ముందుగానే సోవియెట్స్ చంద్రుడిపై తిరిగేందకు ఓ రోవర్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. అయితే, 1971లో నాసా చంద్రుడిపై మనిషి ద్వారా ఆపరేట్ చేయబడే లూనార్ రోవర్ వెహికల్‌ను ప్రవేశపెట్టింది.

అపోలో లూనార్ రోవింగ్ వెహికల్
ఈ వాహనాలను గడచిన 3 అపోలో మిషన్స్ 15, 16, 17 లలో ఉపయోగించారు. దీని మొత్తం బరువు 460 పౌండ్లు. ఇది నాన్-రీచార్జ్‌బల్ జింక్ బ్యాటరీలతో పనిచేస్తుంది.

స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ వెహికల్
లూనార్ రోవర్ చంద్రుడిపై కేవలం కొన్ని గంటలు మాత్రమే పరుగులు తీస్తుంది. కానీ ఈ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ వెహికల్ కాన్సెప్ట్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉండనుంది. గడచిన రెండేళ్లుగా ఈ వాహనాన్ని టెస్టింగ్ చేస్తున్నారు.

స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ వెహికల్
అంతరిక్షంలో దీర్ఘకాలిక శోధన కోసం ఈ వాహనాన్ని ఉపయోగించనున్నారు. ఈ ఎస్ఈవి కొద్దిగా లేదా అసలు మెయింటినెన్స్ అవసరం లేకుండానే వేలకొద్దీ మైళ్లు ప్రయాణించగలదు. వ్యోమగాములు స్పేస్ సూట్ లేకుండానే ఈ వాహనం క్యాబిన్‌లో కూర్చొని, దీనిని డ్రైవ్ చేయొచ్చు.

మార్స్ పాత్‌ఫైండర్/సోజౌర్నర్
గతంలో (1970లో) మార్స్ పైకి పంపిన వికింగ్ ప్రోబ్స్ కన్నా 'చవకగా, వేగంగా మరియు ఉత్తమంగా' ఉండేలా డిజైన్ చేసిన వాహనమే ఈ పాత్‌ఫైండర్. రెడ్ ప్లానెట్ (అంగారక గ్రహం) పైకి నాసా పంపిన తొలి రోబోటిక్ రోవర్ ఇది.

మార్స్ పాత్‌ఫైండర్/సోజౌర్నర్
జులై 1997లో ఇది మార్స్ పైకి చేరుకుంది. ఆరు చక్రాలు కలిగిన ఈ చిన్ని వాహనం వేలాదికి పైగా ఫొటోలను భూమికి పంపించింది.

మార్స్ ఎక్స్‌ప్లొరేషన్ రోవర్స్
స్పిరిట్ అండ్ ఆపర్చ్యునిటీ అని పిలిచే ఈ ట్విన్ 'రోబోట్ జియాలజిస్ట్' అనే వాహనాలను జనవరి 2004లో మార్స్ పైకి పంపించారు. గతంలో ఈ గ్రహంపై నీటి ఆనవాళ్లు ఉన్నయాని గుర్తించేందుకు ఈ వాహనాలను అంగారుకుడి పైకి పంపారు. ఈ రోవర్లు పానారోమిక్ ఫొటోలను తీయటమే కాకుండా, ఆ గ్రహంపై మట్టి శాంపిల్స్‌ను కూడా సేకరించాయి.
ఫొటో మూలం: NASA


Click it and Unblock the Notifications








