సింగ్ ఈజ్ కింగ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

అండర్-19 పంజాబ్ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన యువీ డర్బన్‌లో 19 సెప్టెంబర్ 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ-20 సూపర్ 8వ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు సిక్సులు కొట్టి ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశారు. యువీ కొట్టిన ఆరు అద్భుతమైన సిక్సులకు గానూ బిసిసిఐ పార్షే 911 ఫారిన్ కారుతో సత్కరించినట్లు సమాచారం. బిసిసిఐ ఉపాధ్యక్షుడి చేతుల మీదుగా యువీకి ఈ కారును ప్రెజెంట్ చేయడం జరిగిందట. అంతేకాకుండా.. యువరాజ్ సింగ్‌కు బిసిసిఐ కోటి రూపాయల నగదు బహుమానాన్ని కూడా ప్రకటించినట్లు సమాచారం. పార్షే కారును పక్కన పెడితే.. మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 (దాదాపు రూ. కోటి), బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3 (సుమారు రూ. 80 లక్షలు) కార్లకు యువీ ఓ ప్రౌడ్ ఓనర్.
ఆగండి.. ఆగండి.. ఇక్కడితో యువీ లగ్జరీ కార్ల జాబితా ఆగిపోలేదు.. ఇటీవల జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ 2011లో యువీ చూపిన ఆల్-రౌండ్ ఫెర్మామెన్స్‌కు జెర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఓ లగ్జరీ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 1985లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో కూడా అప్పటి ఆల్-రౌండర్ రవిశాస్త్రి చూపిన ప్రతిభకు ఆడి కంపెనీ ఓ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








