2 కోట్ల కారు అగ్నికి ఆహుతి... గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..!
రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం మానవ తప్పిదాల కారణంగానే జరుగుతుంటాయి. అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఇందులో కార్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కార్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి.
తాజాగా ఇటువంటి ఘటన హర్యానాలోని గురుగ్రాంలోని గోల్ఫ్‌కోర్స్ రోడ్డులో జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన ఓ లగ్జరీ కారు చెట్టును ఢీకొట్టింది. గోల్ఫ్‌కోర్స్ రోడ్ సెక్టర్ 56 నుంచి పోర్షే కారు సికందాపుర్ వైపు వెళ్లోంది. అతివేగం కారణంగా కారును నియంత్రించలేక సెక్టార్ 27లో రోడ్ డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం సర్వీస్ రోడ్‌పైన పడింది. అక్కడ నుంచి వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. కాసేపటికే కారు పూర్తిగా కాలిపోయింది. గుర్తుపట్టలేనట్లుగా తయారైంది.

ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఘటన జరిగిన అనంతరం డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. మరెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ స్పోర్ట్స్ కారు ధర సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అధునాతన స్పోర్ట్స్ కార్ల రైడర్లు అత్యంత వేగంగా దూసుకెళ్లిపోతున్నారు. ప్రమాదాల బారిన పడతామనే కనీస అవకాశం ఉండడం లేదు. స్పోర్ట్ కార్లలో సేఫ్టీ ఫీచర్లతో ఆ కార్లలో ఉన్న రైడర్లు ప్రాణాలతో క్షేమంగా బయటపడవచ్చు. కానీ రోడ్లపై వెళ్తున్న వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు.
జర్మనీకి చెందిన పోర్షే 911 కారు రెండు పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. వీటి సామర్థ్యం 2981 cc మరియు 3996 cc. ఈ కార్లు ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్సిమిషన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ కారు 6 సిలెండర్లతో వస్తుంది. ఈ స్పోర్ట్ కారు 10.64 kmpl మైలేజ్ ఇస్తుంది. 6500 rpm వద్ద గరిష్ఠంగా 379.50 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6300 rpm వద్ద 465Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గరిష్ఠ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 64 లీటర్లు. ఈ కారు గరిష్ఠ వేగం 293 కిలోమీటర్లు. మరియు కేవలం 3 సెకన్లలో 0 kmph నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 100mm మాత్రమే ఉంటుంది. పొడవు 4572 mm, వెడల్పు 1900 mm, వీల్‌బేస్ 2457mm ఉంటుంది. ఈ కారులో వేరియంట్లను బట్టి ఇద్దరు లేదా నలుగురు మాత్రమే కూర్చొనే అవకాశం ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








