లగ్జరీ కార్లకు వేదికగా అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌.. ఒక్కో కారును చూస్తుంటే మతి పోతుంది.!!

దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani- Radhika Merchants Pre Wedding), రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసమే ముఖేష్‌ అంబానీ దంపతులు దాదాపు రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరవుతున్నారు.

అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌లో వివాహ వేడుకలు లగ్జరీ కార్లు(Anant Ambani- Radhika Merchants Pre Wedding Celebrations) తళుక్కుమంటున్నాయి. ప్రపంచంలోని ఖరీదైన కార్లన్నీ వీరి ప్రీ వెడ్డింగ్‌ వివాహ వేడుకలో దర్శనమిస్తున్నాయి. రోల్స్‌ రాయిస్‌, బీఎండబ్ల్యూ, రేంజ్‌ రోవర్‌తో సహా విలాసవంతమైన కార్లలో సెలబ్రిటీలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

Luxury-Cars-At-Anant-Ambani-Radhika-Merchants-Pre-Wedding

సినీ ఇండస్ట్రీతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు(Luxury Cars At Anant Ambani- Radhika Merchants Pre Wedding), రాజకీయ నాయకులు, ప్రముఖ సంగీతకారులు, ఇంకా వివిధ రంగాల్లోని సుసంపన్నులతో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ అట్టహాసంగా జరుగుతున్నాయి. వీరంతా విదేశీ బ్రాండ్‌ కార్లలో గ్రాండ్‌గా తరలివస్తుండటంతో ఇందుకు సంబంధించిన వార్తలు, ఇంట్రెస్టింగ్‌ సమచారాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్లలో టాప్‌ ప్లేస్‌లో ఉండేది రోల్స్‌ రాయిస్‌(Rolls Royce)తో పాటు ఎలక్ట్రిక్‌ బీఎండబ్ల్యూ(BMW) కార్లు ఎకో ఫ్రెండ్లీగా ఉంటూ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఇక ప్రముఖ బాలీవుడ్‌ సెలబ్రిటీలు షారుఖ్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ వంటి ప్రముఖులు.. విలాసవంతమైన రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారులో వేడుకలకు చేరుకున్నారు.

Luxury-Cars-At-Anant-Ambani-Radhika-Merchants-Pre-Wedding

రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌(Rolls Royce Ghost) 6.75 లీటర్‌, ట్విన్‌- టర్బో V12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. 571 hp మరియు 850 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లగ్జరీ కారు ధర రూ. 7.95 కోట్లు(ఎక్స్‌-షోరూమ్‌). కస్టమర్లు తమ అభిరుచికి అనుగుణంగా ఇందులో ఫీచర్లు, కలర్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి ధర మారుతుందని గమనించాలి.

ఈ వేడుకలో మరో స్పెషల్‌ అట్రాక్షన్‌ ఖరీదైన BMW iX ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ. ఫ్లవర్‌ థీమ్‌తో పెయింట్‌ చేయబడిన అనేక బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ కార్లు ఈ వేడుకలో ఆకర్షించాయి. ఈ ఎస్‌యూవీ 329 hp పవర్‌ అవుట్‌పుట్‌ మరియు 630nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సెటప్‌ ప్రతి యాక్సిల్‌పై ఆల్‌-వీల్‌ డ్రైవ్‌ సామర్థ్యంతో వస్తుంది. దీని ధర రూ. 1.25 కోట్లు(ఎక్స్‌-షోరూమ్‌).

Luxury-Cars-At-Anant-Ambani-Radhika-Merchants-Pre-Wedding

ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో అతిథుల కార్ల పార్కింగ్‌లో రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీ(Range Rover SUV) కూడా ఉంది. రేంజ్‌ రోవర్‌ ఐదవ తరం మోడల్ ఆధునిక డిజైన్‌ను కలిగి ఉండటంతో పాటు సొగసైన ఫ్లష్‌ హెడ్‌లైట్లతో విభిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ఏరోడైనమిక్‌ లగ్జరీ ఎస్‌యూవీలలో ఇది ఒకటి. స్పోర్టినెస్‌ లుక్‌తో మరింత విశాలంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 4, 2024, 13:44 [IST]
English summary
Luxury cars seen at anant ambani radhika merchants pre wedding celebrations rolls royce range rover
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+