రోడ్డుపై పశువులను ఢీకొట్టిన రూ.1.48 కోట్ల కారు.. ప్రమాద తీవ్రతకు ఊడిపోయిన కారు టైర్..!
ప్రస్తుతం భారత్‌లో మౌలిక సదుపాయాలు వేగంగా మెరుగుపడుతున్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులు శరవేగంగా నిర్మాణం చేస్తున్నారు. నగరాలతో పలు పట్టణాలను హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలతో అనుసంధానం జరుగుతోంది. వీటిలో చాలా రహదారులపై స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇన్ని ఏర్పాట్లు ఉన్నా.. భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా ఉంటోంది.
రోడ్లపై వాహనదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రహదారి మధ్యలోకి అకస్మాత్తుగా వాహనాలు, మనుషులు, పశువులు, వీధి కుక్కులు రావడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను యూట్యూబర్ ప్రతీక్ సింగ్ తన ఛానల్‌లో షేర్ చేశారు. ఈ ఘటనలో తమిళనాడులోని మహాబలిపురం ఈసీఆర్ రోడ్డులో జరిగింది. పోర్షే 911 కారు రోడ్డుపై అకస్మాత్తుగా వచ్చిన ఆవును ఢీకొట్టింది. చివరి నిమిషంలో కొన్ని పశువులను గుర్తించిన డ్రైవర్ వాహనాన్ని నియంత్రించేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆవును బలంగా ఢీకొట్టాడు. అనంతరం కారు సుమారు 500 మీటర్ల ముందుకు వెళ్లి నిలిచింది.
మన దేశంలో రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటనే ఉదాహరణ. ఈ ఘటనలో కారు భారీగా డ్యామేజీ అయింది. ముందు బంపర్ సహా సైడ్ ప్యానల్స్, కారు డోర్ భారీగా దెబ్బతింది. ముందు వైపున్న టైర్ పూర్తిగా బయటకు వచ్చేసింది, హెడ్‌ల్యాంప్ కూడా డ్యామేజీ అయింది.

పోర్షే కారు ఢీకొట్టిన ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగ్ తెరుచుకున్నాయి. ఫలితంగా కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఖరీధైన ఫోర్షే కారును భారీగా దెబ్బతినడం వల్ల రిపేర్ చేసేందుకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
భారత రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్న సమయంలో చాలా జాగ్రతలు తీసుకోవాలి. అకస్మాత్తుగా వాహనాలు సహా మనుషులు, పశువులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలి. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. రోడ్లపై విధించిన స్పీడ్ లిమిట్‌కు అనుగుణంగా ప్రయాణం చేయాలి. రహదారి నిబంధనలను పాటించాలి.

భారత్‌లో ఈ కారు ధర రూ.1.48 కోట్లు (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ కారు 1418 కేజీ బరువు ఉంటుంది. 6- స్పీడ్ GT స్పోర్ట్స్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు వేరియంట్‌ను బట్టి ఆరు వేర్వేరు వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆన్‌రోడ్ ట్యాక్స్ సహా ఇతర పన్నులతో ధర మరింత ఎక్కువగా ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








