200 కి.మీ వేగంతో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లగ్జరీ కారు.. అసలు విషయం బయటపెట్టిన సీసీ కెమెరా వీడియో..!

అతివేగం భారీ ప్రమాదాలకు కారణం అవుతుంది. తాజాగా జరిగిన ఘటన ఇందుకు సజీవ సాక్ష్యం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఢిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే పైన ఈ ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రోల్స్‌ రాయిస్‌ కారు డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన ఆగస్టు 22న జరిగింది.

ఈ ఘటనలో తొలుత ట్యాంకర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అంతా భావించారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీ టీవీ వీడియో ఆధారంగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ప్రమాదానికి డిజిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ కారణం కాదని వెల్లడైంది. అతను రోడ్ల భద్రతా నిబంధనలను సరిగ్గానే పాటించిట్లు తెలిసింది.

rolls Royce car hits diesel tanker at 200 kmph speed

సీసీ టీవీ వీడియో ఆధారంగా లగ్జరీ రోల్స్‌ రాయిస్‌ కారు సుమారు 200 కి.మీ వేగంతో ప్రయాణించి, డీజిల్‌ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద ధాటికి రోల్స్ రాయిస్ కారు బోల్తా పడింది. డీజిల్ ట్యాంకర్‌ కూడా బోల్తా పడింది. అయితే రోల్స్‌ రాయిస్‌ కారులో వెంటనే మంటలు అంటుకున్నాయి.

రోల్స్‌ రాయిస్‌ 20 వాహనాల భారీ కాన్వాయ్‌లో ఒకటిగా ఉంది. ఆగస్టు 22న ఉదయం 11.11 గంటలకు రాజస్థాన్‌ వెళ్లే మార్గంలో అలీపూర్‌ గుండా ప్రయాణించడం అక్కడ ఉన్న సీసీ టీవీలో రికార్డు అయింది. అయితే కొద్దిసేపటికే కాన్వాయ్‌ నుంచి బయటకు వచ్చిన రోల్స్‌ రాయిస్‌ కారు రోడ్డుపై లేన్‌ మారింది. కేవలం 12 నిమిషాల్లో 40 కి.మీ దూరాన్ని అధిగమించింది. అనంతరం నుహ్ సమీపంలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.

rolls Royce car hits diesel tanker at 200 kmph speed

ఈ ఘటనలో రోల్స్‌ రాయిస్‌ కారు అదుపు తప్పి ఎక్స్‌ప్రెస్‌ వే మధ్య లేన్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు వెంటనే దగ్ధమైంది. అయితే కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి. కారులోని ప్రయాణికులను బయటకు తీశారు. వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ట్యాంకర్‌ డ్రైవర్‌, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. ట్యాంకర్‌ ట్రక్కులోని మరొకరు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ రహదారుల సంస్థకు చెందిన అత్యవసర బృందాలు ఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. డీజిల్‌ ట్యాంకర్‌ వద్ద చిక్కుకున్న ఒకరిని రక్షించారు. వాటితోపాటు అగ్నిమాపక సిబ్బంది సైతం ఘటన స్థలికి చేరుకొని, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. కారు గుర్తుపట్టలేని విధంగా తయారైంది.

rolls Royce car hits diesel tanker at 200 kmph speed

అయితే బోల్తా పడిన డీజిల్‌ ట్యాంకర్‌ నుంచి ఎటువంటి ఇంధనం లీక్‌ కాలేదు. ఒకవేళ లీక్‌ జరిగి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేదని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 26, 2023, 13:25 [IST]
English summary
Luxury rolls royce car hits diesel tanker at 200 kmph speed on delhi mumbai expressway
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+