వెస్ట్ కోస్ట్ కస్టమ్స్ నుంచి మ్యాడ్ మ్యాక్స్ మాగ్న్ ఓపస్ కార్!
వీడియో గేమ్‌లలో కనిపించే కార్లు నిజజీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది..? ఇదిగో ఇలాగే ఉంటుంది. 'మ్యాడ్ మ్యాక్స్ మాగ్న్ ఓపస్' (Mad Max Magnum Opus) ఓ క్రేజీ కార్ క్రాష్ వీడియో గేమ్. ఈ గేమ్‌లో మ్యాడ్ మ్యాక్స్ మాగ్న్ ఓపస్ కారు ఎదురుగా వచ్చే కార్లను గుద్దుకుంటూ, క్రాష్ చేసుకుంటూ వెళ్లిపోతుంటుంది. ఈ గేమ్ పట్ల ఇప్పటికే మంచి క్రేజ్ నెలకొని ఉంది.
ఈ గేమ్‌లో ప్రధానపాత్రధారి అయిన మ్యాడ్ మ్యాక్స్ మాగ్న్ ఓపస్ కారులా ఉండే ఓ కారును వెస్ట్ కోట్స్ కస్టమ్స్ తయారు చేసింది. ఈ గేమ్ ప్రీ-లాంచ్ ప్రమోషన్‌లో భాగంగా ఈ కారును తయారు చేశారు. ఇందుకోసం వెస్ట్ కోస్ట్ కస్టమ్స్ ఓ ఫోర్డ్ ఫాల్కన్ కూపే కారును ఉపయోగించింది. గేమ్‌లో కనిపించే విధంగానే ఈ కారును అన్ని యాక్ససరీలతో తయారు చేశారు.
మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి. చివరి స్లైడ్‌లో వీడియో టీజర్‌ను వీక్షించడం మర్చిపోకండి.

మ్యాడ్ మ్యాక్స్ వీడియో గేమ్‌ను అవలాంచే స్టూడియోస్ డెవలప్ చేసింది. 1970-80 మూవీ సిరీస్‌ల నుంచి స్ఫూర్తి పొంది ఈ గేమ్‌ను తయారు చేశారు.

మ్యాడ్ మ్యాక్స్ 2015లో విడుదల కానుంది. ఇదొక పోస్ట్-అపోకాల్పిక్ట్ వెహిక్యులర్ కోంబాట్ వీడియో గేమ్. వేస్ట్‌ల్యాండ్‌లో ఈ గేమ్‌ప్లే జరుగుతుంది. అక్కడ హెవీగా మోడిఫై చేయబడిన కార్లతో అవతలి వాళ్ల కార్లను ధ్వంసం చేస్తుంటారు.

ఈ గేమ్‌ను ఆడే ఆటగాళ్లు తమ కార్లను అందుబాటులో అనేక రకాల యాక్ససరీలు, ఆయుధాలతో కస్టమైజే చేసుకోవచ్చు.
వీడియో
మ్యాడ్ మ్యాక్స్ మాగ్నమ్ ఓపస్ గేమ్‌కు సంబంధించిన ఓ టీజర్ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.


Click it and Unblock the Notifications








