90 ఏళ్ల వయసులో బామ్మ చేసిన పనికి ముఖ్యమంత్రి సైతం ఫిదా..!!

మనం ప్రతి రోజూ ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలను మరియు ఎంతో ఆసక్తి కరమైన సంఘటనలను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. అయితే ఇటీవల ఇదే నేపథ్యంలో అందరిని ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసే ఒక వీడియో వెలువడింది. ఈ వీడియో ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రినే ఫిదా చేసింది. ఇంతకీ ఆ వీడియో ఏంటి.. దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనే మొత్తం విషయాలను క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం.

డ్రైవింగ్ చేస్తూ అదరగ్గొడుతున్న 90 ఏళ్ల బామ్మ [వీడియో].. ముఖ్యమంత్రి సైతం ఫిదా

నివేదికల ప్రకారం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఒక 90 ఏళ్ల వృద్ధురాలు ఎంతో నైపుణ్యంతో Maruti 800 (మారుతి 800) కారును డ్రైవ్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన ఎంతోమంది వీక్షకులు ఒక్క సరిగా హవాక్కయ్యారు.

డ్రైవింగ్ చేస్తూ అదరగ్గొడుతున్న 90 ఏళ్ల బామ్మ [వీడియో].. ముఖ్యమంత్రి సైతం ఫిదా

ఈ వీడియో కేవలం సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి "శివరాజ్ సింగ్ చౌహాన్" ను ఆకర్షించింది. ఈ వీడియోను అతడు అతని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. స్వయం కృషితో ఏదైనా నేర్చుకోవడానికి వయసుతో సంబంధం అవసరం లేదు. ఇంత వయసులో కూడా కారుని డ్రైవ్ హేయడం నిజంగా హర్షించదగ్గ విషయం అని ఆయన పేర్కొన్నారు.

మారుతి 800 కారుని డ్రైవ్ చేస్తున్న వీరు మహిళ పేరు 'రేషమ్ బాయి తన్వర్‌'గా గుర్తించబడింది. ఈమె మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలోని బిలావలి ప్రాంతానికి చెందినదిగా తెలిసింది. తన కుటుంబంలో దాదాపు అందరికి డ్రైవింగ్ తెలుసని, ఈ కారణంగా తానూ కూడా డ్రైవింగ్ నేర్చుకున్నానని ఆమె తెలిపింది.

డ్రైవింగ్ చేస్తూ అదరగ్గొడుతున్న 90 ఏళ్ల బామ్మ [వీడియో].. ముఖ్యమంత్రి సైతం ఫిదా

'రేషమ్ బాయ్ తన్వర్' మీడియాతో మాట్లాడుతూ, తనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని అందువల్లనే ఇది సాధ్యమయ్యిందని తెలిపింది. అంతే కాకుండా ఆ వృద్ధ మహిళ వద్ద కార్లు మరియు ట్రాక్టర్లు ఉన్నట్లు కూడా తెలిపింది. సాధారణంగా వయసుమళ్ళిన వారు ఇంట్లో కూర్చుని ఉండటం చూసి ఉంటాము, కానీ 90 ఏళ్ల ప్రాయంలో కూడా చలాకీగా కారు డ్రైవ్ చేయడం అనేది అసాధారణ విషయం.

డ్రైవింగ్ చేస్తూ అదరగ్గొడుతున్న 90 ఏళ్ల బామ్మ [వీడియో].. ముఖ్యమంత్రి సైతం ఫిదా

మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి "శివరాజ్ సింగ్ చౌహాన్" షేర్ చేసిన ఈ వీడియోని ఎంతోమంది లైక్ చేశారు, అంతే కాకుండా షేర్ కూడా చేసారు. కొంతమంది వీక్షకులు ఆమె డ్రైవింగ్ నైపుణ్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. కానీ కొంతమంచి ఈ వీడియోపై అభ్యంతరాలను వెల్లడించారు.

కొంతమంది ప్రజారహదారిపై కారు నడపడానికి ఆ వృద్ధ మహిళకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. మధ్యప్రదేశ్ రవాణా శాఖ ప్రకారం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ 20 సంవత్సరాల వరకు లేదా 50 సంవత్సరాల వయస్సు వరకు ఏది ముందు ఉంటే అది జారీ చేయబడుతుందని తెలిపారు. వాణిజ్య వాహనాల కోసం జారీ చేసిన శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్లపాటు పునరుద్ధరించబడాలి.

డ్రైవింగ్ చేస్తూ అదరగ్గొడుతున్న 90 ఏళ్ల బామ్మ [వీడియో].. ముఖ్యమంత్రి సైతం ఫిదా

ప్రస్తుతం, భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం గరిష్ట వయస్సు పరిమితి 75 సంవత్సరాల కోసం మోటార్ వాహనాల చట్టంలో మార్పులను కేంద్రం పరిశీలిస్తోంది. అయితే ఇంత వయసులో కారుని నడపడం నిజనంగా చాలా గొప్ప విషయం అయినప్పటికీ, ప్రజా రహదారిపై ఇది అనర్థాలకు దారి తీస్తుంది.

ఎందుకంటే వయసు మళ్ళిన వారు కారుని అదుపు చేయడం కొంత శ్రమతో కూడుకున్న పని, కావున అత్యవసర సమయంలో కారుని కంట్రోల్ చేయలేకపోతే, అనుకోని ప్రమాదం జరిగుతుంది. ఇది కేవలం వాహనదారులకు మాత్రమే కాకుండా రోడ్డుపై ఉన్న ఇతరులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కావున డ్రైవింగ్ పై ఎంత ఇష్టం ఉన్నప్పటికీ వయసుమళ్ళిన వారు ప్రజారహదారిపై డ్రైవింగ్ చేయకపోవడం చాలా ఉత్తమం.

భారతదేశంలో రోడ్జురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువవుతొంది. ఈ కారణంగా మోటార్ వాహన చట్టం కఠినమైన నిబంధనలను అమలు చేస్తుంది. కావున వాహనదారులు తప్పకుండా ఈ నియమాలను పాటించాలి.

డ్రైవింగ్ చేస్తూ అదరగ్గొడుతున్న 90 ఏళ్ల బామ్మ [వీడియో].. ముఖ్యమంత్రి సైతం ఫిదా

ఇక మారుతి 800 కారు విషయానికి వస్తే, ఇది భారతీయ మార్కెట్లో విడుదలైన సమయంలో ఊహకందని అమ్మకాలతో ఒక చరిత్ర సృష్టించింది. అయితే కాలక్రమంలో అనేక కొత్త వాహనాలు విడుదలైన కారణంగా ఈ మారుతి 800 కారుకున్న ఆదరణ తగ్గుతూ వచ్చింది. మారుతి 800 మంచి సామర్త్యాన్ని అందిస్తూ వాహన వినియోగారూలకు చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇప్పుడు కూడా రోడ్లపైన అక్కడక్కడా మారుతి 800 కార్లు దర్శనమిస్తాయి.

Most Read Articles

English summary
Madhya pradesh 90 year old woman drive maruti 800 shows driving skills details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X