డ్రైవింగ్ లైసెన్స్ & రిజిస్ట్రేషన్ కార్డులో కొత్త మార్పు

భారతదేశంలో వాహనదారులు మోటార్ వాహన చట్టం ప్రకారం తప్పని సరిగా రిజిస్టేషన్ కార్డును కలిగి ఉండాలి. ఈ రిజిస్టేషన్ కార్డులు వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఉంటాయి. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత వాహన రిజిస్ట్రేషన్ కార్డును విడుదల చేసింది. ఈ ఏకీకృత రిజిస్ట్రేషన్ కార్డు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

డ్రైవింగ్ లైసెన్స్ & రిజిస్ట్రేషన్ కార్డులో కొత్త మార్పు

2019 మార్చిలో దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్సులు మరియు వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులను ఏకరూపతలో తీసుకురావడానికి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని మధ్యప్రదేశ్ రవాణా శాఖ కమిషనర్ వి మధు కుమార్ తెలిపారు.

డ్రైవింగ్ లైసెన్స్ & రిజిస్ట్రేషన్ కార్డులో కొత్త మార్పు

ఈ నోటిఫికేషన్ ప్రకారం మధ్యప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ వెహికల్ రిజిస్ట్రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఈ పథకాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్.

డ్రైవింగ్ లైసెన్స్ & రిజిస్ట్రేషన్ కార్డులో కొత్త మార్పు

భారతదేశంలోని ప్రతి రాష్ట్రం తమ సొంత వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేస్తాయి. ఇవి ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి చాలా భిన్నంగా ఉంటాయి.

డ్రైవింగ్ లైసెన్స్ & రిజిస్ట్రేషన్ కార్డులో కొత్త మార్పు

కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాల వాహనదారులు ఒకే రిజిస్ట్రేషన్ కార్డును కలిగి ఉండాలి. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్.

డ్రైవింగ్ లైసెన్స్ & రిజిస్ట్రేషన్ కార్డులో కొత్త మార్పు

మధ్యప్రదేశ్ రాష్ట్రము ఇప్పటికే దీనిని అమలు చేయడంతో పాటు ఆరు మంది వాహనదారులకు కీకృత వాహన రిజిస్ట్రేషన్ కార్డుని మరియు డ్రైవింగ్ లైసెన్సుని ముఖ్యమంత్రి కమల్ నాథ్ నేతృత్వంలో అందించడం జరిగింది.

డ్రైవింగ్ లైసెన్స్ & రిజిస్ట్రేషన్ కార్డులో కొత్త మార్పు

ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ ఐడి కార్డులో మునుపటి కార్డుల మాదిరిగా కాకుండా చాలా అప్డేటెడ్ సమాచారాన్ని కలిగి ఉంటాయి. ఈ కార్డులలో వాహనం మరియు వాహనదారుని గురించి పూర్తి సమాచారం ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్ & రిజిస్ట్రేషన్ కార్డులో కొత్త మార్పు

డ్రైవర్ లైసెన్స్ కార్డులో కూడా ఇలాంటి సమాచారం ఉంటుంది. ఈ కార్డులో క్యూఆర్ స్కాన్ ఉంటుంది. దీనిని స్కాన్ చేసిన వెంటనే వాహనదారునికి సంబంధించిన అన్ని వివరాలు తెలిసిపోతాయి. అంతే కాకుండా వాహనదారుని పేరు బ్లడ్ గ్రూప్, పుట్టిన తేదీతో పాటు కార్డు యొక్క కాల వ్యవధి వంటివి ఇందులో ఉంటాయి.

డ్రైవింగ్ లైసెన్స్ & రిజిస్ట్రేషన్ కార్డులో కొత్త మార్పు

సాధారణంగా మోటర్ వాహన చట్టం ప్రకారం వాహనదారుడు తప్పనిసరిగా ప్రభుత్వ డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కార్డులను కలిగి ఉండాలి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ వంటివి లేకపోతే వీరు చట్టబద్దంగా శిక్షార్హులు. వీరికి ప్రభుత్వం నిర్దేశించిన జరిమానా విధించబడుతుంది.

Most Read Articles

English summary
Madhya Pradesh launches unified vehicle registration card. Read in Telugu.
Story first published: Thursday, February 27, 2020, 10:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X