వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు చాలా తీవ్ర స్థాయిలో వున్నాయి. ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని వేలమంది మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన వారి కుటుంబాలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల మద్రాస్ హై కోర్ట్ 2013 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కేసుని తిరిగి పరిష్కరించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా దంత వైద్యురాలు తీవ్రంగా గాయపడింది.

వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

ప్రమాదంలో గాయపడిన ఆమె శరీరంలో దాదాపు 90% స్తంభించిపోయింది. ఈ కేసుపై ఇంతకుముందు దర్యాప్తు చేసిన మోటార్ ట్రాఫిక్ ట్రిబ్యునల్, బాధితుల కుటుంబానికి రూ. 18,43,908 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ పరిహారం మొత్తం చాలా తక్కువగా ఉందని మద్రాస్ హైకోర్టులో అప్పీల్ దాఖలైంది.

వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

ఈ కేసును న్యాయమూర్తులు కిరుబకరన్, అబ్దుల్ కుతుబ్ ధర్మాసనం ముందు విచారించారు. ఈ పరిహారం మొత్తాన్ని ప్రస్తుతం ట్రయల్ కోర్టు రూ. 1 కోటి 49 లక్షలకు పెంచింది. ట్రిబ్యునల్ ఈ మొత్తం పరిహారాన్ని 7 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. 2013 నుండి దీనికి 7% వడ్డీని జోడించడం జరుగుతుంది.

MOST READ:డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

కేసు విచారణ సమయంలో, రోడ్డు ప్రమాదాలలో మరణాలు సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం మితిమీరిన వేగం. కావున వాహనాల యొక్క వేగపరిమితిని తగ్గించడానికి ప్రభుత్వం కఠినమైన ఆదేశాలను జరీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం వాహనాలు నియమిత వేగం కంటే వేగంగా వెళ్ళకూడదు.

వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

కేంద్ర ప్రభుత్వం 2018 లో ఎక్స్‌ప్రెస్‌వేలపై గరిష్ట వేగ పరిమితిని గంటకు 120 కిలో మీటర్ల వరకుపెంచింది. ఈ వేగ పరిమితిని సమీక్షించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. 2009 మరియు 2019 మధ్య గణాంకాలతో పోలిస్తే గత పదేళ్లలో రోడ్డు ప్రమాదాల మరణాల సంఖ్య రెట్టింపు అయిందని విచారణలో తేలింది.

MOST READ:వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

సరాసరి ప్రతి గంటకు 6 మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని సెంట్రల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఒక నివేదికలో తెలిపింది. ఈ ప్రమాదాల్లో ప్రమాదానికి గురవుతున్న వారిలో 70% మంది 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కావడం గమనార్హం.

వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

దీనిని దృష్టిలో ఉంచుకుని ఉంచుకుని ద్విచక్ర వాహనాల్లో స్పీడ్ లిమిట్ టెక్నాలజీని అమలు చేయాలని ద్విచక్ర వాహన తయారీదారులకు సూచించాలని చెన్నై హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ విధానం అమలైతే లిమిట్ స్పీడ్ లో వెళ్ళవచ్చు.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కారు కొన్న మరో బాలీవుడ్ సెలబ్రెటీ.. ఎవరంటే?

వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

దిగుమతి చేసుకున్న వాహనాల్లో కూడా ఈ టెక్నాలజీని తప్పనిసరి చేయాలని న్యాయమూర్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. నియమిత వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలను పర్యవేక్షించడానికి అవసరమైన డ్రోన్‌లను ఉపయోగించవచ్చని కూడా ట్రిబ్యునల్ సూచించింది.

NOTE: ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Madras High Court Directs To Install Speed Limiter In Two Wheelers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X