మద్రాస్ హైకోర్టు తీర్పుకి ద్విచక్రవాహనదారుల గుండెల్లో గుబులు

భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ రోడ్డు ప్రమాదాల్లో కూడా ఎక్కువ భాగం ద్విచక్రవాహనాలకు సంబంధించినవే ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు తీవ్ర స్థాయిలో జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మాత్రమే కాకుండా వాహనదారుల యొక్క మితిమీరిన వేగం కూడా.

అయితే ఈ ప్రమాదాలు నివారించడానికి సంబంధిత ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మద్రాస్ హైకోర్టు కొన్ని ముఖ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మద్రాస్ హైకోర్టు తీర్పుకి ద్విచక్రవాహనదారుల గుండెల్లో గుబులు

మద్రాస్ హైకోర్టు జారీ చేసిన నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాలు తప్పకుండా మిర్రర్స్ కలిగి ఉండాలి. ఒక వేళా ఈ నియమాన్ని వాహనాదారులు ఉల్లఘించినట్లైతే వారికి చట్ట రీత్యా కఠినమైన శిక్షలు విదించబడుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

మద్రాస్ హైకోర్టు తీర్పుకి ద్విచక్రవాహనదారుల గుండెల్లో గుబులు

వాహనదారులు ప్రయాణ సమయంలో రోడ్డు మలుపుల్లో వెళ్ళేటప్పుడు ఈ మిర్రర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా వెళ్తున్నప్పుడు మన వెనుక వస్తున్న వాహనాలను కూడా ఈ మిర్రర్స్ ద్వారా గమనించవచ్చు. ఈ విధంగా గుర్తించడం వల్ల ప్రమాదాలు కొంత వరకు నివారించవచ్చు.

మద్రాస్ హైకోర్టు తీర్పుకి ద్విచక్రవాహనదారుల గుండెల్లో గుబులు

కొంత మంది వాహనదారులు స్టైల్ కోసమో మరే ఇతర కారణంతోనే ద్విచక్ర వాహనాలకున్న మిర్రర్స్ తొలగిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల స్టైల్ గా ఉడొచ్చేమో కానీ, వెనుక వచ్చే వాహనాలను గుర్తించలేరు కావున ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. వాహనానికి మిర్రర్స్ లేకపోతే మలుపులో తిరిగి వచ్చే వాహనాలను గమనించలేకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి.

మద్రాస్ హైకోర్టు తీర్పుకి ద్విచక్రవాహనదారుల గుండెల్లో గుబులు

ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ ఒక న్యాయవాది మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. ద్విచక్ర వాహనాలపై మిర్రర్స్ తొలగించడం వల్ల మరిన్ని ప్రమాదాలు సంభవించాయని ఆయన ఆరోపించారు. అద్దాలను తొలగించే వారికి జరిమానా విధించాలని ఆయన అభ్యర్థించారు.

మద్రాస్ హైకోర్టు తీర్పుకి ద్విచక్రవాహనదారుల గుండెల్లో గుబులు

ద్విచక్ర వాహనాల్లో అద్దాల ఏర్పాటును కఠినంగా అమలు చేయాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తమిళనాడు రవాణా కమిషనర్‌కు ఆదేశించింది. ద్విచక్ర వాహనాలపై అద్దాలను తొలగించడం వల్ల వాహనం యొక్క వారంటీ రద్దు అవుతుందని వినియోగదారులను హెచ్చరించాలని వాహన తయారీదారులకు సూచించాలని రవాణా కమిషనర్లకు సూచించబడింది.

మద్రాస్ హైకోర్టు తీర్పుకి ద్విచక్రవాహనదారుల గుండెల్లో గుబులు

ద్విచక్ర వాహనాల్లో మిర్రర్స్ తప్పనిసరి చేయడానికి అవసరమైతే కొత్త వారంటీ నిబంధనలను అమలు చేయాలని కోర్టు సూచించింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వు ద్విచక్ర వాహనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఇకపై తప్పకుండ వాహదారులు తమ ద్విచక్ర వాహనాలకు మిర్రర్స్ ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే జరిగే పరిణామాలు అనుభవాయించాల్సి వస్తుంది. వాహనదారులు దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.

Most Read Articles

English summary
Madras High Court Orders To Install Mirrors In Two Wheelers. Read in Telugu.
Story first published: Friday, July 16, 2021, 12:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X