మీ కారులో సన్ ఫిల్మ్ ఉందా.. వెంటనే తొలగించండి, లేకుంటే?

భారతదేశంలో వాహనాలను మాడిఫై చేయడం ఇప్పుడు చాలా సర్వసాధారణంగా మారిపోయింది. కానీ మోటార్ వాహన చట్టానికి వ్యతిరేఖంగా మాడిఫైడ్ చేసిన వాహనాలు వినియోగించడం మాత్రం చట్ట విరుద్ధం. ఇలాంటి వాహనాలపై పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే కారు యొక్క విండోస్ కి సన్ ఫిల్మ్‌ ఉపయోగించడం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ కారణంగా సన్ ఫిల్మ్స్‌ వినియోగించే వాహనంపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

మీ కారులో సన్ ఫిల్మ్ ఉందా.. వెంటనే తొలగించండి, లేకుంటే?

కొంతమంది వాహన వినియోగదారులు తమ వాహనాలలో ఇప్పటికి కూడా సన్ ఫిల్మ్‌ తీసివేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల మద్రాస్ హైకోర్టు కార్లలో ఏర్పాటు చేసిన సన్ ఫిల్మ్‌లను తొలగించడానికి దీనికోసం 60 రోజులు గడువు ఇస్తున్నట్లు తమిళనాడు రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మీ కారులో సన్ ఫిల్మ్ ఉందా.. వెంటనే తొలగించండి, లేకుంటే?

ఈ నియమాన్ని ఉల్లంఘించిన వాహనాలను జప్తు చేయవచ్చని కూడా తెలిపింది. కార్లలో సన్ ఫిల్మ్ ఉపయోగించడం భారతదేశంలో నిషేధించబడింది. ఇప్పుడు, మద్రాస్ హైకోర్టు కూడా సన్ ఫిల్మ్‌లను తొలగించడానికి చర్యలు తీసుకుంటోంది. కావున దీనిపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

మీ కారులో సన్ ఫిల్మ్ ఉందా.. వెంటనే తొలగించండి, లేకుంటే?

ఇటీవల, గుజరాత్ రవాణా శాఖ కూడా సన్ ఫిల్మ్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. చాలా మంది తమ కార్ల కిటికీలు మరియు గ్లాసులపై సన్ ఫిల్మ్‌ని ఇన్‌స్టాల్ చేస్తారు. అలాంటి కార్లపై సూరత్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్లు చేశారు. ఈ స్పెషల్ ఆపరేషన్ సెప్టెంబర్ 2 న ప్రారంభమై సెప్టెంబర్ 6 న ముగిసింది.

మీ కారులో సన్ ఫిల్మ్ ఉందా.. వెంటనే తొలగించండి, లేకుంటే?

రవాణా శాఖ ప్రారంభించిన ఈ ఆపరేషన్ సమయంలో మొత్తం 2,531 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్ల కిటికీలు మరియు గాజు కిటికీలపై సన్ ఫిల్మ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. సూరత్ పోలీసులు ఆ కార్ల యజమానులకు జరిమానా కూడా విధించారు.

నివేదికల ప్రకారం, సూరత్ పోలీసులు మొత్తం రూ. 12.65 లక్షలు జరిమానాలు ఈ సన్ ఫిల్మ్‌లు ఇన్స్టాల్ చేయడం వల్ల వసూలు చేశారు. సీనియర్ పోలీసు అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలోనే సూరత్‌లోని చాలా మంది కార్ల యజమానులు తమ కార్లలో సన్ ఫిల్మ్‌లను తొలగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

మీ కారులో సన్ ఫిల్మ్ ఉందా.. వెంటనే తొలగించండి, లేకుంటే?

ఈ స్పెషల్ ఆపరేషన్ గురించి సీనియర్ పోలీసు అధికారులు మాట్లాడుతూ, ఆపరేషన్ జరిగిన ఐదు రోజుల్లో, సన్ ఫిల్మ్‌తో 2,531 కార్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆ కార్ల యజమానులకు అక్కడికక్కడే జరిమానా విధించారని కూడా తెలిపారు.

మీ కారులో సన్ ఫిల్మ్ ఉందా.. వెంటనే తొలగించండి, లేకుంటే?

ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఈ స్పెషల్ వెహికల్ ఆపరేషన్ చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. కావున ప్రమాదానికి గురైన కారుకి సన్ ఫిల్మ్ అమర్చారు. దీనివల్ల పోలీసులు కారులో ఉన్నవారిని సరిగ్గా గుర్తించలేకపోయారు.

ఈ నేపథ్యంలో, సూరత్ నగర పోలీసులు సన్ ఫిల్మ్‌లకు వ్యతిరేకంగా తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో భారతదేశంలో సన్ ఫిల్మ్ చాలా సంవత్సరాలు నిషేధించబడింది. ఎందుకంటే కార్ల లోపల పెరుగుతున్న నేరాల సంఖ్య నేపథ్యంలో, సన్ ఫిల్మ్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.

మీ కారులో సన్ ఫిల్మ్ ఉందా.. వెంటనే తొలగించండి, లేకుంటే?

సాధారణంగా కారు లోపల సన్ ఫిల్మ్ ఉంటే లోపల ఏమి జరుగుతుందో బయటి వ్యక్తులకు తెలియదు. క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొనే వారికి సన్ ఫిల్మ్ వాడకం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్లలో సన్ ఫిల్మ్‌లు ఉండటం వల్ల అనేక నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఈ కారణంగానే కార్లలో సన్ ఫిల్మ్ వాడకాన్ని సుప్రీం కోర్టు నిషేధించింది.

సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ కూడా, చాలా మంది ఇప్పటికీ సన్ ఫిల్మ్‌లను ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో వారిపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కావున కార్లలో సన్ ఫిల్మ్ కలిగిన వాహనదారులు త్వరగా వీటిని తొలగించాలి. లేకుంటే కఠినమైన చర్యలకు గురికావాల్సి వస్తుంది.

మీ కారులో సన్ ఫిల్మ్ ఉందా.. వెంటనే తొలగించండి, లేకుంటే?

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, కొత్త మోటార్ వాహన చట్టం సెప్టెంబర్ 2019 లో ఆమోదించబడింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులు భారీ జరిమానాలు చెల్లించాలి ఉంటుంది. వాహన వినియోగదారులు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. లేకుంటే భారీ జరిమానాలు చెల్లించడమే కాకుండా, మీ వాహనాలు కూడా జప్తు చేయబడతాయి.

NOTE: ఇక్కడ ఉపయోగించిన ఫొటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Madras high court orders traffic cops to remove sun film from cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X