సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్, తయారుచేసింది ఓ స్టూడెంట్

భారతదేశంలో ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా చాలా మంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇదిలా ఉండగా కొంతమంది తమ ఆలోచనలతో కొత్త కొత్త వాహనాలను తయారుచేస్తున్నారు.

ఇటీవల కాలంలో కెఎల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు బృందం వైర్‌లెస్ ఛార్జింగ్ తో పనిచేసే ఒక ఎలక్ట్రిక్ బైక్ తయారుచేశారు. ఇప్పుడు తమిళనాడులో ఇలాంటి ఎలక్ట్రిక్ సైకిల్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్, తయారుచేసింది ఓ స్టూడెంట్

నివేదికల ప్రకారం, తమిళనాడులోని మదురై నుండి కాలేజీకి చెందిన ఒక స్టూడెంట్ ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారుచేశారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సోలార్ పవర్ తో నడుస్తుంది. ఈ విద్యార్థి ఆవిష్కరించిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కి సంబంధించిన ఫోటోలు కూడా విడుదలయ్యాయి.

సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్, తయారుచేసింది ఓ స్టూడెంట్

మదురైలోని కాలేజీలో చదువుతున్న ఈ స్టూడెంట్ పేరు 'ధనుష్ కుమార్'. వార్తా సంస్థ ANI యొక్క నివేదిక ప్రకారం, మదురై కళాశాల విద్యార్థి ధనుష్ కుమార్ సోలార్ పవర్ తో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్‌ను రూపొందించారు. సోలార్ ప్లేట్స్ సహాయంతో ఈ సైకిల్ 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్, తయారుచేసింది ఓ స్టూడెంట్

ఇందులో ఛార్జ్ తగ్గిన తర్వాత కూడా దాదాపు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించగలదు, అని నివేదికలో పేర్కొంది. వార్తా సంస్థ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క పరిధితో పాటు కిలోమీటరుకు దాని ధర మరియు ఛార్జీల గురించి కూడా సమాచారం అందించింది.

సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్, తయారుచేసింది ఓ స్టూడెంట్

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క బ్యాటరీ కోసం ఉపయోగించే విద్యుత్ ఖర్చు పెట్రోల్ ధర కంటే చాలా తక్కువ. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ 50 కిలోమీటర్ల ప్రయాణించడానికి కేవలం రూ. 1.50 ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఈ ఈ-సైకిల్ 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్, తయారుచేసింది ఓ స్టూడెంట్

మదురై వంటి నగరం లోపల ప్రయాణించడానికి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సరిపోతుందని, స్టూడెంట్ ధనుష్ కుమార్ వ్యక్తం చేశారు. ధనుష్ కుమార్ యొక్క ఈ-సైకిల్ కి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్‌లో చాలా రెస్పాండ్స్ వస్తున్నాయి. చాలామందికి ఈ సోలార్ ప్లేట్స్ తో పనిచేసే ఈ సైకిల్ చాలా బాగా నచ్చింది.

Most Read Articles

English summary
Madurai College Student Designs Solar Powered Electric Cycle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X