లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ వ్యాపించడం వల్ల ఎంతోమంది ప్రజల జీవితాలు దుర్భర స్థితిలోకి చేరింది. ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిన దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో కరోనా వైరస్ నివారణకోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కరోనా లాక్ డౌన్ విధించడం జరిగింది.

లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇల్లుదాటి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలి. అంతే కాకుండా ఈ లాక్ డౌన్ సమయంలో పెళ్లి మొదలైన శుభకార్యాలు పరిమిత సంఖ్యలో హాజరై జరుపుకోవాలని ప్రభుత్వాలు ఇదివరకే ప్రకటనలు కూడా చేసింది.

లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

మానవుని జీవితంలో పెళ్లి అనేది ఒక మరపురాని మధురమైన సంఘటన. కావున ప్రతి వ్యక్తి తమ పెళ్లిని ఎంతో ఆడంబరంగా కుటుంభం సభ్యులతో మరియు స్నేహితులతో జరుపుకోవాలని కళలు కంటారు. అయితే ఈ కరోనా మహమ్మారి ఇలాంటి వారి ఆశాలన్నింటిని ఆవిరి చేసింది.

MOST READ:రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?

లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

అయితే ఇలాంటి కఠినమైన పరిస్థితిలో కూడా ఒక జంట అంగరంగవైభవంగా తమ వివాహాన్ని జరుపుకుంది. దీని కోసం ఈ జంట ఒక ప్రత్యేకమైన మార్గాన్ని వెతుక్కుంది. ఈ మార్గం ఏమిటంటే భూమి మీద ఎందరో ఆడంబరంగా పెళ్లి చేసుకున్నారు, కానీ ఈ జంట మాత్రం ఆకాశంలో తమ బంధు సమేతంగా వివాహం జరుపుకున్నారు.

లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

నివేదికల ప్రకారం తమిళనాడులోని మధురైకి రాకేష్, దక్షిణ అనే జంట మదురై-బెంగళూరు మార్గంలో వెళ్లే ఒక విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ఈ విధంగా బుక్ చేసుకున్న తరువాత పురోహితుడితో సహా మొత్తం తమ 161 మంది బంధువులతో భూమినుంచి సుమారు 22 వేల అడుగుల ఎత్తులో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

MOST READ:గిఫ్ట్‌గా పొందిన థార్ ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవ్ చేసిన క్రికెటర్ [వీడియో]

లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతున్న కరోనా 9 కర్ఫ్యూ మరియు వివాహ పరిమితులను నివారించడానికి ఫ్లైట్‌లో వివాహం చేసుకోవాలని వారు భావించారు. దీని కోసం ఈ విమానానికి రెండు గంటల రెంట్ కట్టి బుక్ చేసుకున్నట్లు తెలిసింది.

దీనికి సంబంధించిన ఈ చిన్న వైరల్ వీడియోలో, వరుడు వధువు మెడకు మంగళసూత్రాన్ని కట్టడం చూడవచ్చు. ఈ సమయంలో బంధువులు వారిపై పువ్వులు జల్లుతూ ఎంతో ఉత్సాహంగా ఉండటం కూడా చూడవచ్చు. ఈ వీడియో పోస్ట్ ఇప్పటికే 1.6K కంటే ఎక్కువ మంది వీక్షించారు.

MOST READ:దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా

లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

అయితే ఈ సమయంలో విమానాన్ని ఎక్కడానికి ముందు తాము కరోనా టెస్ట్ నిర్వహించామని, టెస్ట్ చేసి నెగిటీవ్ వచ్చిన తరువాత ఈ వేడుక జరుపుకోవడం జరిగిందని వధూవరుల తరపు బంధువులు తెలిపారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలా చేయడం మంచిది కాదు.

Most Read Articles

English summary
Madurai Couple Get Married In Flight To Avoid Corona Curfew Video Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X