Just In
- 2 min ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 40 min ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 1 hr ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 15 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా .. టచ్ చేసి చూడు .. కొడాలి నానికి దేవినేని ఉమ సవాల్
- Sports
మ్యాచ్‌కే హైలైట్! స్టార్క్ షార్ట్ పిచ్ బంతికి.. గిల్ ఎలా సమాధానం ఇచ్చాడో చూడండి వీడియో
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాలుగు గంటల ఛేజింగ్ తర్వాత పట్టుబడ్డ దొంగలు.. విచారణలో తేలిన అసలైన నిజాలు
భారతదేశంలో ఇటీవలి దొగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ దొంగతనాలను నివారించడానికి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వీటిని పూర్తిగా నివారించలేకపోతున్నారు. ఇటీవల పోలీసులు ఇద్దరు దొంగలను నాలుగు గంటలు వెంబడించి అరెస్టు చేశారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఆటో హిందుస్తాన్ టైమ్స్ యొక్క నివేదికల ప్రకారం, ఈ సంఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతంలో కూడా ఇటీవల కాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా పోలీసులు తనిఖీ కోసం చెక్‌పోస్టులను నిర్మించారు.

పోలీసులు పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవర్తించారు. వెంటనే పోలీసులు ఇద్దరిని తనిఖీ చేయడానికి బయలుదేరారు. పట్టుబడతారనే భయంతో ఆ ఇద్దరు వ్యక్తులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు కూడా వారు తప్పించుకోకూడదని వెంబడించారు.
MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

పోలీసులు సుమారు నాలుగు గంటలు వెంబడించిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ ఇద్దరినీ విచారించినప్పుడు అసలైన నిజాలు బయటపడ్డాయి. ఈ విచారణలో ఆ ఇద్దరు వ్యక్తులు పార్క్ చేసిన కార్ల నుండి డీజిల్ దొంగిలించినట్లు నేరాన్ని అంగీకరించారు.

వారు పట్టుబడిన ఆ ఒక్కరోజు మాత్రమే దాదాపు 140 లీటర్ల డీజిల్‌ను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును తీవ్రతరం చేయడంతో పాటు, వాహనాలనుంచి డీజిల్ దొంగిలించడానికి వీలుగా ఉపయోగపడుతున్న రెండు కీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీరిద్దరూ కలిసి రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాల నుండి చాలా రోజుల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ దొంగలిస్తున్నారు. చివరకు పోలీసుల అనుమానం నిజమైంది. ఈ అనుమానంతోనే ఈ ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు.

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు డీజిల్ మరియు పెట్రోల్ కొనడానికి ఇబ్బదులు పడుతున్నారు. ఈ ధరల పెరుగుదల సాధారణ స్థితికి రావడానికి ఇంకా చాలా రోజులు పట్టే అవకాశం ఉంది.
MOST READ:హోండా కార్ మాస్క్.. కారుకి మాస్క్ ఏంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

ఈ సమయంలోనే డీజిల్ దొంగలిస్తున్న ఈ దొంగలను అరెస్ట్ చేయడం వల్ల కొంతమంది ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంలో కూడా వీరు ఎక్కువగా పెట్రోల్ మరియు డీజిల్ దొంగలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి దొంగతనాలను వీలైనంత వరకు పూర్తిగా రూపుమాపాలి.

ఇలాంటి దొంగతనాలను నుంచి విముక్తి పొందటానికి వాహనదారులు తమ వాహనాలను సురక్షితమైన ప్రదేశాలలో లేదా సీసీటీవీ కెమెరాలు ఉన్న చోట పార్క్ చేసి ఉంచడం చాలా మంచిది. ఇలాంటి దొంగతనాలు పూర్తిగా రోపుమాపాలంటే, పోలీసులకు వాహనదారుల సహకారం ఎంతైనా అవసరం.
MOST READ:డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?
NOTE:ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే