భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

భారతదేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా పాకుతోంది. రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్న ఈ కరోనా వైరస్ నివారణకు ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, పూణేలో సాయంత్రం 6 నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ప్రకటించింది.

భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

మహారాష్ట్రలో విధించిన ఈ కర్ఫ్యూ తప్పకుండా అందరూ పాటించాలి. పూణేలో, స్థానిక పరిపాలన గత రెండు రోజులలో అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలను నిలిపివేసింది. ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. అంతే కాకుండా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లైతే కఠినమైన జరిమానాలు కూడా విధిచబడుతుంది.

భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

పూణే నగరంలో విధించిన కర్ఫ్యూ గురించి పోలీస్ కమిషనర్ రవీంద్ర సిస్వే మాట్లాడుతూ, అన్ని మార్గదర్శకాలను సక్రమంగా పాటించేలా పోలీసు అధికారులు చూసుకుంటున్నారని చెప్పారు. ఇందుకోసం పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్, వజ్రా వాహనాలను కూడా చేర్చారు.

MOST READ:స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్; అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

ఇక్కడ కరోనా ఎక్కువగా ఉన్నందున ఏప్రిల్ 6 కు ముందే ప్రజలకు ఈ లాక్ డౌన్ గురించి సమాచారం అందించారు. అయితే కరోనా లాక్ డౌన్ విధించిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకూడదు. కానీ వైద్యం వంటి అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలకు అనుమతి ఉంటుంది.

భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

ఎట్టకేలకు ప్రభుత్వం చెప్పిన విధంగానే ఏప్రిల్ 7 నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ఈ కరోనా లాక్ డౌన్ లో చాలామంది ప్రజలు నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన చాలామంది వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

MOST READ:యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తున్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి పూణేలో 96 చెక్‌పోస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనవసరంగా బయట తిరుగుతున్న ప్రజలను పోలీసులు విచారిస్తున్నారు.

భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

లాక్ డౌన్ విధించినప్పటి నుంచి, లాక్ డౌన్ ఉల్లంఘించిన వారి నుంచి పోలీసులు దాదాపు 13.5 కోట్ల రూపాయల జరిమానాను వసూలు చేశారు. పేస్ మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్న వారి నుంచి పోలీసులు మొత్తం రూ. 4.82 లక్షలు వసూలు చేశారు. ఇప్పటివరకు నగరంలోని 2,78 లక్షల మందికి పోలీసులు ఇన్వాయిస్‌లు జారీ చేసి మొత్తం రూ .13.5 కోట్లు వసూలు చేశారు.

MOST READ:ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ

భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

గత ఏడాది ఇలాంటి సమయంలోనే పోలీసులు వేల సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించిన తరువాత జరిమానాలు విధించి వారి వాహనాలను వారికి అప్పగించారు.

భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

ఇప్పుడు కూడా అధికంగా వ్యాపిస్తున్న కరోనా నివారణ కోసం విధించిన ఈ లాక్ డౌన్ ఉల్లంఘిస్తే మునుపటి లాగే చర్యలు తీసుకుంటారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులకు సహకరిస్తూ కరోనా నివారణలో పాలు పంచుకోవాలి. అప్పుడే కరోనాను నివారించడం సులభం అవుతుంది.

MOST READ:ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్.. కారణం ఏమిటంటే?

Most Read Articles

English summary
Maharashtra Covid-19 Lockdown Rules Vehicles Driving License Can Be Seized. Read in Telugu.
Story first published: Thursday, April 8, 2021, 16:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X