మీ పిల్లలు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికితే రూ.25 వేల జరిమానా, 25 సంవత్సరాల వరకు లైసెన్స్‌ పొందలేరు..!!

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు వివరీతంగా పెరుగుతోంది. దీనికి ఏవైనా కారణాలు ఉండవచ్చు కానీ డ్రైవింగ్ అనుభవం లేమి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ఈ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా జరుగుతున్న యాక్సిడెంట్లలో మైనర్లు ఎక్కువ సంఖ్యలో పట్టుబడుతున్నారు.

భారత చట్టం ప్రకారం కేవలం 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే వాహనాలు నడపాలి. దీనిని అతిక్రమిస్తే వారిపై తగిన చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు/అధికారులకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారిని జైలుకు పంపే చట్టం కూడా ఉంది. అయితే పిల్లల సరదా కోసం తల్లిదండ్రులు వారిని ప్రోత్సాహిస్తుండటం కలవర పెడుతోంది. పిల్లల్నీ అదుపులో పెట్టాల్సింది పోయి వారికి వాహనాలను అప్పగిస్తుండటంతో ఈ ప్రమాదకు కారణమతున్నారు.

Maharastra-Traffic-Rules

పోలీసులు ఎన్ని నిబంధనలు తీసుకువచ్చిన చాలా మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. ద్విచక్ర వాహనాలే కాదు, కార్లు వంటి పెద్ద వాహనాలను కూడా సరైన వయసుకు చేరుకోకముందే నడుపుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిలో మైనర్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వీటిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులు, బాలికలు వాహనాలు నడపకుండా పలు చర్యలు తీసుకుంటున్నాయి.

మైనర్లు డ్రైవింగ్‌ని అదుపుచేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల చట్టం 1988కు అనుగుణంగా కొన్నిసవరణలు చేసింది. పిల్లలు, బాలికలు తగిన వయస్సుకు చేరుకోకముందే వాహనాలు నడపకుండా పూర్తిగా నిరోధించడానికి ఈ మార్పులు చేశారు. రోడ్లపై వారు డ్రైవింగ్ చేయకుండా ఈ నిర్ణయాలను అమలు చేయనుంది.

ఈ కొత్త సవరణతో పిల్లలు, బాలికలు తగిన వయస్సుకు చేరుకోకముందే వాహనాలు నడిపితే రూ.25,000 వరకు జరిమానా విధించనుంది. ఈ జరిమానా మొత్తాన్ని తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా, ఈ సవరణలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. అంటే 18 ఏళ్లు నిండక ముందే వాహనాలు నడుపుతూ పట్టుబడే పిల్లలు, బాలికలు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందలేరు.

Maharastra-Traffic-Police

మైనర్‌గా ఉండి పోలీసులకు దొరికిన వారు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 25 ఏళ్ల వరకు వేచి చూడాల్సి వస్తుంది. అంటే దాదాపు ఏడు సంవత్సరాల వరకు వారు రోడ్డు ప్రమాదాల కారణంగా మహారాష్ట్రలో ప్రతి సంవత్సరం సుమారు 15,000 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఇంకా ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ ఏమాత్రం తగ్గడం లేదని వెల్లడించింది.

ఓ సంవత్సరంలో జరుగుతున్న ప్రమాదాల్లో సగానికి పైగా ద్విచక్ర వాహన చోదకుల కారణంగా జరిగుతున్నాయని పేర్కొంది. ఫలితంగా 7,700 మంది మరణించారని వెల్లడించింది. ఇలాంటి కఠిన నిర్ణయాల తీసుకురావడం వల్ల పరిస్థితిని అదుపు చేయడం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నియమాలు కారణంగా కాస్త మార్పు వచ్చే అవకాశం ఆశిస్తున్నారు.

డ్రైవ్ స్పార్క్ వ్యాఖ్య: ప్రభుత్వం ఎన్ని చట్టాలు అమలు చేసినా రోడ్లపై మనం చేస్తున్న తప్పులను సరిదిద్దుకుంటే తప్పా రోడ్డు ప్రమాదాల సంఖ్యను నివారించలేము. కాబట్టి చిన్న వయసులో డ్రైవింగ్ చేయడాన్ని తల్లిదండ్రులు గర్వంగా భావించవద్దు. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే తమ పిల్లలను డ్రైవింగ్ కు అనుమతించాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, July 1, 2023, 18:14 [IST]
English summary
Maharashtra government enhance new strict rules to control minor driving
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+