ముంబైలో పెట్రోల్-డీజిల్ వాహనాలపై నిషేధం విధించనున్నారా? సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే విషపూరిత వాయువుల ద్వారా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అయింది. దీంతో మనుషులు స్వచ్చమైన గాలిని పీల్చుకోవడం చాలా కష్టతరం అవుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో జనాభా ఎక్కువగా కావడం వలన సొంత వాహనాల వాడకం పెరిగిపోయి వాయు కాలుష్యం పెరుగుతుంది. ప్రధానంగా భారత్‌‌లో వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ముంబై నగరంలో ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో వాహనాలు రోడ్లపై నడుస్తుంటాయి. దీంతో వాటి నుంచి వెలువడే విషపూరిత వాయువుల కారణంగా ముంబై మహానగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై మెట్రోపాలిటన్ ఏరియాల్లో పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకంపై నిషేధం విధించి ఎలక్ట్రిక్, CNG వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి సాహసోపేతమైన చర్య తీసుకుంది.

ముంబై మెట్రోపాలిటన్ నగరాల్లో పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్, CNG వాహనాలను మాత్రమే అనుమతించే విషయంపై అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమంచింది. మొత్తం దీనిలో 7 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వం వహిస్తారు. అలాగే ఇతర మెంబర్స్ కూడా ఉంటారు. వీరి వివిధ స్థాయిల్లో అధ్యయనం చేయనున్నారు.

Planning To Ban On Petrol And Diesel Vehicles In Mumbai

కమిటీలో మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కార్పొరేషన్ ప్రాజెక్ట్ మేనేజర్‌లు, ముంబై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. వీరు అధ్యయనం చేసి మొత్తం నివేదికను మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఈ మేరకు ఈ కొత్త కమిటీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రానున్న కాలం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు అవుతుంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రోత్సాహం అందించడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. దేశంలో జనాభా పెరుగుతున్నంతా వేగంగా వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రధానంగా ముఖ్య నగరాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముంబై లాంటి మహానగరాల్లో ఇది అంచనాలకు మించి ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వీటి ద్వారా వాయు కాలుష్యం ఎక్కువగా అవుతుందని గుర్తించి కొత్త ఆలోచనతో ముందడుగు వేసింది.

Mumbai Traffic

6,640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం ఉంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)లో డోంబివిలి, కళ్యాణ్, థానే, భివాండి నిజాంపూర్, నవీ ముంబై, మీరా భయాందర్, వసాయి విరార్, ఉల్హాస్‌నగర్, పన్వెల్ ఏరియాలు ఉన్నాయి. మహారాష్ట్ర రవాణా శాఖ నుంచి వచ్చిన డేటా ప్రకారం, డిసెంబర్ 2024 చివరి నాటికి 1.20 కోట్ల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.

ఇవన్నీ కూడా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 9 ప్రాంతీయ రవాణా కమిషనర్ కార్యాలయాల్లో(RTO)నమోదైన వాహనాల డేటా ఇది. ప్రధానంగా ముంబై నగరంలో దాదాపు 50 లక్షల వాహనాలు రిజిస్టర్ కాగా, థానేలో 57 లక్షలు, రాయ్‌గఢ్ జిల్లాలో 13 లక్షల కొత్త వాహనాలు RTOలో నమోదు చేసుకున్నాయి. ప్రతి ఏడాది వాహనాలు పెరగడం, దాని కారణంగా వాయు కాలుష్యం పెరగడం వంటి చర్యల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయుకాలుష్యం ఏ రేంజ్‌లో పెరిగిందో అందరం చూస్తూనే ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం గతంలో సరి, బేసి సంఖ్యల విధానాన్ని కూడా పాటించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కఠిన పరిస్థితులు రాకుండా చూడటానికి ముందు జాగ్రత్తగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వం ఈ కమిటీని నియమించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 29, 2025, 14:43 [IST]
English summary
Maharashtra government sets up panel to explore ban on petrol and diesel vehicles in mumbai
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+