ఆ ఐదు కీలక టోల్‌గేట్ల వద్ద టాక్స్ రద్దు.. ఆ రాష్ట్ర రాజధానిలోకి వెళ్లే ప్రజలకు ఇక పండుగే!
మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని టోల్‌గేట్ల వద్ద ఫీజు వసూలుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ (Maharashtra Assembly Elections) ఎన్నికలకు ముందు ప్రజలకు ఇది పెద్ద ఆఫర్ అని చెప్పవచ్చు. ఆ రాష్ట్ర టూరిజంలో కీలకంగా ఉన్న ఆర్థిక రాజధాని ముంబయిలోకి ప్రవేశించే ఐదు కీలక టోల్ బూత్‌ల వద్ద టోల్ రుముసును ఫ్రీ చేసింది. ఎంపిక చేసిన టోల్‌గేట్ల వద్ద లైట్ మోటార్ వెహికిల్ (Light Motor Vehicles)కి ఇకపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచే అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన కీలక వివరాలు ఈ కథనంలో..
ముంబయి లోకి ప్రవేశించే కీలక ఐదు టోల్ బూత్‌ల వద్ద లైట్ వెహికిల్స్ టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. దహిసర్, ఆనంద్ నగర్ టోల్, వైశాలి, ములుంద్, ఐరోలి క్రీక్ బ్రిడ్జ్ టోల్ బూత్‌ల వద్ద ఇకపై టోల్ వసూలు ఉండదు. ముంబయిలోకి ప్రవేశించాలంటే ఈ టోల్ బూత్‌లు కీలకంగా ఉంటాయి. ఈ టోల్ బూత్‌ల వద్ద ప్రస్తుతం లైట్ వెహికిల్స్‌కి రూ.45 వసూలు చేస్తున్నారు.

ఇకపై కారు డ్రైవర్లు ఎలాంటి రుసుము లేకుండా ముంబయిలోకి ప్రవేశించవచ్చు. ఈ ప్రకటనతో ముంబయిలోని ఈ 5 టోల్ బూత్‌ల నుంచి సుమారు 2.80 లక్షల మంది కార్ డ్రైవర్లకు ప్రయోజనం చేకూరనుందని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఓ నివేదికలో తెలిపింది. ఈ టోల్ ప్లాజాల ద్వారా రోజుకు సుమారు రూ.1.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో టోల్ ట్యాక్స్ ఫ్రీ చేయడం వల్ల ప్రభుత్వం ఈ రోజువారి ఆదాయాన్ని కోల్పోనుంది. అయితే ఈ టోల్ బూత్‌లను ఫ్రీ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. తాజాగా ఆ రాష్ట్ర ఎన్నికలు (Maharashtra Elections) దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను (Global Navigation Satellite System) తీసుకురాబోతోంది.

ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో కొత్త జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇదివరకే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీనిని దేశంలో పైలట్ ప్రాజెక్టుగా NHAI రెండు రహదారులపై జీఎన్ఎస్ఎస్ ట్రయల్స్‌ని నిర్వహిస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు మరికొన్ని రోజులు సమయం పట్టనుంది.
ఈ GNSS వ్యవస్థ అమల్లోకి వచ్చాక కేవలం ప్రయాణించిన దూరానికి మాత్రమే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులకు కలిసిరానుంది. ఫాస్టాగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను ఈ విధానం ద్వారా మార్పు చేయనున్నారు. తద్వారా దీనిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. దీని అమలు కోసం గ్లోబల్ టెండర్‌ని నిర్వహించడం విశేషం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా వినియోగదారులకు ఖర్చు తగ్గనుంది.
దీని కింద వాహనం హైవేలోకి ప్రవేశించగానే ఆ వాహనంలో అమర్చిన జీపీఎస్ పరికరం ద్వారా సాఫ్ట్వేర్ దాని లొకేషన్ను గుర్తిస్తుంది. దీని తరువాత, వాహనం హైవే నుండి నిష్క్రమించిన తర్వాత ప్రవేశ మరియు నిష్క్రమణ దూరం ఆధారంగా ఆటోమేటిక్ ఖాతా నుండి టోల్ ఫీజు మినహాయించబడుతుంది. దీనివల్ల టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








