రీల్స్ చేయబోయి ప్రాణాలు కోల్పోయిన యువతి.. 300 అడుగుల లోయలో పడ్డ కారు.. భయపెడుతున్న వీడియో!!

కారులో రీల్స్‌ చేస్తుండగా దురదృష్టశావత్తూ లోయలో పడిపోయింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ యువతి తన కారును రివర్స్ చేసే ప్రయత్నంలో 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె కారును రివర్స్‌ చేసే క్రమంలో ఈ సంఘటన జరగడంతో అక్కడ విషాదచాయలు అలుముకున్నాయి. అయితే కారు రివర్స్‌ చేసే క్రమంలో చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్తగా కారు నేర్చుకున్న వారు ముందు డ్రైవింగ్ కంటే వెనక డ్రైవింగ్‌పై అంత పట్టు ఉండదు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు.

అయితే కారు రివర్స్‌ చేసేటప్పుడు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి? మొదటిసారి డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో వివరించాం. ముందుగా ఈ ఘటన విషయానికి వస్తే మహారాష్ట్రలో ఛత్రపతి చామరాజనగర్ అనే ఓ ఫేమస్‌ కొండ ప్రాంతం ఉంది. ఈ కొండపై నిలబడి ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. అంతే కాకుండా ఇక్కడి అందాలను ఆస్వాదించడానికి చాలా మంది తమ వాహనాలలో వస్తారు.

Woman-Dies-In-Car-Reversing

23 ఏళ్ల శ్వేత అనే అమ్మాయి తన స్నేహితుడితో కలిసి కారులో ఆ ప్రాంతానికి వెళ్లింది. శ్వేతకు కారు నడపడం అలవాటు లేదని వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ క్రమంలో కారులో సరదాగా కూర్చుని కారు నడుపుతున్నట్లు ఫోజ్‌ ఇచ్చేందుకు శ్వేత కారులో ఎక్కింది. శ్వేత స్నేహితుడు కారును స్టార్ట్ చేసి రివర్స్ గేర్ లో పెట్టి శ్వేతకు అప్పగించాడు. తొలిసారి డ్రైవింగ్‌ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా పెట్టాలని అనుకుంది.

ఇంతకు ముందు కారు డ్రైవింగ్ అలవాటు లేని శ్వేత కారులోకి ఎక్కి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పెట్టేందుకు కారులో కూర్చొని వీడియో తీయడం ఆరంభించింది. ఆ తర్వాత అనుకోకుండా కారు యాక్సిలరేటర్ నొక్కడంతో. దీంతో కారు రివర్స్‌లో దూసుకెళ్లింది. సుమారు 300 అడుగుల లోతులో పడిపోయింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కళ్లముందే ఘోరాన్ని చూసి వారు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Woman-Dies-In-Car-Reversing

శ్వేత కారును కంట్రోల్ చేయలేకపోడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన మొత్తాన్ని ఆమె స్నేహితుడు కెమెరాలో బంధించాడు. కారు రివర్స్ లో 300 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో అతని స్నేహితుడు వెంటనే సమీపంలోని పోలీసులు, ప్రజల సహాయం కోరాడు. కారుతో గుంతలో పడిన యువతిని రక్షించేందుకు అక్కడి వారు నానా తంటాలు పడ్డారు. సుమారు గంట తర్వాత కారు బోల్తా పడిన ప్రదేశాన్ని గుర్తించగలిగారు.

కారులో చిక్కుకున్న శ్వేతను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్వేత మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నుండి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదటిసారి డ్రైవింగ్ చేసేటప్పుడు సురక్షితమైన ప్రదేశంలో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయాలి. కారుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిన తర్వాతే కారులో ఎక్కాలి. యాక్సిలరేటర్ అంటే ఏమిటి? బ్రేక్ క్లచ్ వంటి అన్ని వివరాలు తెలుసుకోవాలి.

అప్పుడే మీరు కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి. కారుని రివర్స్‌లో తీసుకెళ్తునప్పుడు ఎలా నడపాలో అవగాహన ఉండాలి. దీనికోసం ఎక్స్‌పర్ట్స్‌ లేదా డ్రైవింగ్‌ స్కూల్‌ ట్రైనర్‌ వద్ద సలహా తీసుకోవాలి. అలా చేయడం వల్ల కారు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఈ ఘటనలో శ్వేత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదాన్ని గ్రహించకుండా కారు నడిపిన వీడియోను చూడవచ్చు. మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు పక్కనఖచ్చితంగా డ్రైవింగ్ తెలిసిన వ్యక్తి ఉండాలి.

సురక్షితమైన ప్రదేశంలో డ్రైవ్ చేయండి. బహిరంగ రోడ్లపై వాహనాలు నడపడం మానుకోవాలి. తొలిసారి డ్రైవింగ్‌ నేర్చుకునేటప్పుడు గ్రౌండ్ లేదా ఖాళీ ప్రదేశాల్లో డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఆ తర్వాత మీ డ్రైవింగ్ నైపుణ్యాలు మెరుగుపడిన తర్వాత మీరు పబ్లిక్ రోడ్‌పైకి రావాలి. ఇలాంటి ప్రదేశాల్లో డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నించడం ప్రమాదానికి దారితీస్తుంది మరియు ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు చేయడం మానుకోవాలి.

More from DriveSpark

Article Published On: Thursday, June 20, 2024, 10:14 [IST]
English summary
Maharashtra women dies while reversing car pressed accelerator video gone viral
Read more on: #off beat #video #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+