Just In
- 10 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 11 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 14 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 14 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రతన్ టాటా వెహికల్ నెంబర్ వాడుతూ పట్టుబడ్డ యువతి.. తర్వాత ఏం జరిగిందంటే?
మనం అప్పుడపుడు అధికారికంగా ద్రువీకరించని నెంబర్ ప్లేట్స్ ఉపయోగించి పట్టుబడ్డ వాహనదారుల గురించి చాలా చూసి ఉంటాము. అంతే కాకుండా కొంతమంది ప్రముఖ వ్యక్తుల వాహనాల నెంబర్ ప్లేట్స్ ఉపయోగిస్తూ కూడా పట్టుబడ్డ సంఘటనలు కోకొల్లలు. కానీ ఇప్పుడు ఏకంగా టాటా మోటార్స్ యొక్క అధినేత రతన్ టాటా కారు యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎవరో గుర్తు తెలియని ఉపయోగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇది రతన్ టాటాను ఆశ్చర్యానికి గురిచేసింది. రతన్ టాటా దేశంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఈయన టాటా మోటార్స్ కంపెనీ ద్వారా అద్భుతమైన కార్లను అందిస్తున్నారు. రతన్ టాటా, టాటా మోటార్స్ మాత్రమే కాకుండా అనేక ఇతర ప్రముఖ కంపెనీలను కూడా కలిగి ఉన్నారు.

ఇక అసలు విషయానికి వస్తే ఒక యువతి తన కారుకు రతన్ టాటా యొక్క ఫాన్సీ నంబర్‌ను ఉపయోగిస్తూ పట్టుబడింది. ఆ యువతిని మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసి, ఆమె కారును స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో దిలీప్ చాబ్రియా కేసులో అప్రమత్తంగా ఉన్న పోలీసులు సిసి ఫుటేజుల ద్వారా ఈ నెంబర్ ని గుర్తించారు.
MOST READ:అద్భుతంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టీజర్.. ఓ లుక్కేయండి

రతన్ టాటా వెహికల్ నెంబర్ ఉపయోగిస్తున్న ఆ యువతిని పట్టుకుని పోలీసులు ప్రశ్నించినప్పుడు, ఆ నెంబర్ రతన్ టాటా నెంబర్ అని తనకు తెలియదని చెప్పింది. పట్టుబడ్డ యువతీ తన బీఎండబ్ల్యూ కారుకు ఎంహెచ్ 01 డికె 111 నంబర్ ను ఉపయోగిస్తోంది. ఈ నెంబర్ రతన్ టాటాకు సంబంధించినది. అంతే కాకుండా ఈ నెంబర్ రతన్ టాటా తన కొర్వెట్టి సూపర్ కార్‌లో ఉపయోగించబడింది.

కొర్వెట్టి చేవ్రొలెట్ కంపెనీకి చెందిన కారు. కొర్వెట్టి సూపర్ కారును రతన్ టాటా కొనుగోలు చేసింది. ఈ కారు ధర 58,900 యూరోలు. ప్రస్తుతం, ఒక యూరో ధర రూ. 90.20. కావున ఈ కారు యూరోపియన్ దేశాలలో సుమారు రూ .53 లక్షలకు అమ్ముడవుతోంది. రతన్ టాటాకు చెందిన నంబర్‌ను తన బిఎమ్‌డబ్ల్యూ కారులో ఉపయోగించిన యువతి ట్రాఫిక్ నిబంధనలను చాలాసార్లు ఉల్లంఘించింది.
MOST READ:ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

ఈ విషయంపై మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఖ్య రతన్ టాటాకు చెందినది, అతను ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించలేదని తెలుసుకున్న తరువాత, పోలీసులు కారు ఓనర్ అయిన ఆ యువతిని గుర్తించి అరెస్ట్ చేశారు.

ఈ నేరానికి పాల్పడిన ఆ యువతిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా యువతి మరేదైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడిందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా త్వరలో తెలియాల్సి ఉంది.
MOST READ:ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను ప్రారంభించింది. ఢిల్లీలో ఇప్పటికే హెచ్‌ఎస్‌ఆర్‌పి నెంబర్ ప్లేట్స్ తప్పనిసరి చేయబడింది. హెచ్‌ఎస్‌ఆర్‌పి అమలు తరువాత, నకిలీ నంబర్ ప్లేట్‌లను ఉపయోగించడానికి ఎటువంటి అవకాశం ఉండదు.

కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి నేరాలను రూపుమాపడానికి వివిధ చట్టాలను రూపొందించాయి. ఇప్పుడు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉపయోగించడం వల్ల వాహనాలకు చాలా పటిష్టమైన భద్రతను కల్పించవచ్చు. ఇవి దొంగతనాలు మొదలైన వాటినుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది.