జాతిపిత మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

పాఠకులందరికీ ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో కీలక పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరైన జాతిపిత మహాత్మా గాంధీ గురించి తెలియని వారుండరు.

By N Kumar

భారతదేశానికి స్వాతంత్య్ర రావడంలో కీలక పాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన జాతిపిత మహాత్మా గాంధీ గురించి తెలియని వారుండరు.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

చేతితో వడికిన వస్త్రాలు ధరించి ఎంతో సాదాసీదాగా గడిపిన జాతిపిత వద్ద ఒక్క సొంత కారు కూడా ఉండేది కాదు. 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహాత్మా గాంధీ ఉపయోగించిన కార్ల గురించి ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...!

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

మహాత్మా గాంధీ వద్ద అప్పట్లో కారు కొనుగోలు చేసేంత సంపద ఉన్నప్పటికీ, ఆయన ఎన్నడూ వాటిపై వ్యామోహ పడలేదు. అప్పట్లో కారు కలిగి ఉండటం అంటే, పెద్ద హోదాను కలిగి ఉండటంగా భావించే వారు. మహాత్మా గాంధీ ఒక్క కారు కూడా యజమాని కాలేకపోయారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

గాంధీజీ కారును కొనకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో కారులో ప్రయాణించారు. అలా ఆయన ప్రయాణించిన కార్లలో ఒకటి ఈ పురాతన ఫోర్డ్ కారు. మహాత్మా గాంధీ ఈ కారులో ప్రయాణించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా ఈ కారుకు మంచి పాపులారిటీ వచ్చింది.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

బాపూజీ 1927లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ సెంట్రల్ జైలు నుంచి ఈ ఫోర్డ్ టి సిరీస్ కారులో ప్రయాణం చేశాడు. ఆ తర్వాత ఈ కారు ఎన్నో చేతులు మారి ప్రస్తుతం పూనేలోని అబ్బాస్ జండేవాలా వద్దకు చేరింది.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

పురాతన కార్లను సేకరించడమంటే అబ్బాస్‌కు భలే సరదా. అతని వద్ద సుమారు 30 పురాతన కార్లు ఉన్నాయి. పూనేలోని వివిధ పురాతన కార్ల షోరూమ్‌లలో ఈ కారును ప్రదర్శించటం కూడా జరిగింది.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

అప్పట్లో ఈ ఫోర్డ్ టి సిరీస్ కారు అత్యంత ఖరీదైన మరియు ప్రాచుర్యమైన కార్లలో ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు రోల్స్ రాయిస్, ల్యాంబోర్ఘి, ఫెరారి లగ్జరీ కార్లు ఎలాగో అప్పట్లో ఫోర్డ్ టి సిరీస్ అలాగన్నమాట.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

బాపూజీ ప్రయాణించిన కార్లలో చెప్పుకోదగిన మరొక కారు రాజ్‌కోట్ మహారాజుకు చెందిన 'స్టార్ ఆఫ్ ఇండియా' అనే పురాతన రోల్స్ రాయిస్ కారు.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

ఈ కారును మహారాజు కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ రాజ్‌కోట్ రాజ కుటుంబానికి మహాత్మా గాంధీ తండ్రి కరంచంద్ దివాన్‌గా పనిచేసేవారు. ఈ కారులో మహాత్మా గాంధీ, ఇంగ్లాండ్ రాణిలు ప్రయాణించారని చెప్పుకుంటారు.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

మహాత్మా గాంధీజీకి 1928లో స్థాపించిన కుమార్ టాక్సీస్‌తో మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. 1928లో ఎస్. కృష్ణన్ మరియు కె.బి. కుమరన్‌లు ఈ కంపెనీను ప్రారంభించారు. ఈ కంపెనీకి బాపూజీ కూడా ఓ కస్టమరే. 1928లో గాంధీజీ 'ఓవర్‌ల్యాండ్ విప్పెట్' అనే కారులో ప్రయాణించారు.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

అప్పట్లో 'ఓవర్‌ల్యాండ్ విప్పెట్' కారు ధర ఎంతో తెలుసా.. కేవలం 825 రూపాయల 12 అణాలు మాత్రమే. అంతేకాదు అప్పట్లో ఒక లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు మాత్రమే. కుమార్ టాక్సీస్‌కు చెందిన 'ఓవర్‌ల్యాండ్ విప్పెట్' కారులో గాంధీజీ తొలిసారిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ కారుకు 'జోసెఫ్ మిరాండా' అనే వ్యక్తి డ్రైవర్‌గా ఉన్నాడట.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

గాంధీజీ రెండోసారి కుమార్ టాక్సీస్‌ వద్దకు వచ్చి కారును అద్దెకు అడిగినప్పుడు ఇది వరకు డ్రైవ్ చేసిన మిరాండానే డ్రైవర్‌గా కావాలని ఆయన కోరారని మోహన్ దాస్ పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మోరాజీ దేశాయ్, జేఆర్‌డి టాటా, ఏబి వాజ్‌పేయి, విజయ మాల్య, ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్‌లు కూడా ఒకప్పుడు ఈ కుమార్ టాక్సీ కంపెనీ కస్టమర్లే. ఇప్పటికీ ఈ సంస్థ కార్యకాలాపాలు నిర్వహిస్తోంది.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు

జనవరి 30, 1948వ తేదీన గాడ్సే ఘాతుకానికి మన గాంధీ తాత బలయ్యారు. గాడ్సే తుపాకీతో గాంధీజీ కాల్చడంతో హేరామ్ అంటూ ఒక్కసారిగా నేలకు ఒరిగిపోయాడు. గాంధీజీ అంతిమ యాత్రలో లక్షలాది మంది భారతీయులు పాల్గొని ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు.

Most Read Articles

Read more on: #independence day #offbeat
English summary
Read In Telugu: Mahatma Gandhi Journey In Cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X