ధోనీ గ్యారేజ్‌లోకి విలాసవంతమైన లగ్జరీ రేంజ్ రోవర్! ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)కి క్రికెట్‌తో పాటు కార్స్, బైకులన్నా కూడా చాలా ఇష్టమని అందిరికీ తెలిసిందే. ఆయన గ్యారేజీలో వందల వాహనాలు ఉన్నాయి. వాటిలో పాత అరుదైన బైక్స్, కార్స్‌తో పాటు లేటెస్ట్‌గా మార్కెట్లోకి విడుదలైన పలు మోడళ్ల వరకు ఉంటాయి. కార్ల విషయానికి వస్తే, ఖరీదైన లగ్జరీ కార్లు ఆయన వద్ద ఉన్నాయి. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయితే దాని గురించి పూర్తిగా వాకబు చేసుకుని తనకు నచ్చినట్టు ఉంటే వెంటనే కొనుగోలు చేసి గ్యారేజీలో పెట్టుకుంటారు. కోట్లు విలువ చేసే కార్లను కలిగి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా తమ ఇంటికి కొత్త బంధువును తీసుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆ బంధువు ఎవరో కాదు కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (range rover autobiography). ఇటీవల ఈ Suv కారును ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
రాంచీలోని ధోని ఫామ్‌హౌస్ ముందు ట్రక్కుపై ఈ కొత్త కారు పార్క్ చేసినట్టు ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కారు మొత్తం కూడా కవర్‌తో కప్పబడి ఉంది. దానికి దగ్గరగా వెళ్లి డైమండ్-టర్న్డ్, గ్లాస్ బ్లాక్ కాంట్రాస్ట్ వీల్స్‌ను జాగ్రత్తగా గమనించినట్లయితే అది 'రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ' అని తెలుస్తుంది. ఈ వీడియోను ఆయన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ఇప్పటికే డజన్ల కొద్ది కార్లను కలిగి ఉన్న ధోనీ ఇప్పుడు ఈ కొత్త కారును కొనుగోలు చేసినట్లు వీడియోను చూస్తే అర్థం అవుతుంది. భారతీయ మార్కెట్లో 'రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ' SUV ప్రారంభ ధర రూ. 2.70 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. కొత్త మోడల్ స్టాండర్డ్ వీల్‌బేస్ (SWD), లాంగ్ వీల్‌బేస్ (LWD) వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. ఇది చూడటానికి చాలా స్టైల్‌గా కనిపిస్తుంది.
ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ 2996 cc పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 394 Bhp పవర్, 550 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV గంటకు 242 కి.మీ వేగంతో రయ్ మంటూ దూసుకుపోతుంది. ఈ కారుతో రోడ్డుపై వెళ్తుంటే చుట్టు ప్రక్కల ఉన్న అందరి చూపు కూడా కారు పైనే ఉంటుంది.
లగ్జరీ కారు కాబట్టి దాదాపు దీన్ని ధనవంతులే ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్‌లో ఈజీగా ఉండటానికి దీని ఇంజిన్‌కు 8-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జోడించారు. పేరుకు తగ్గట్టుగానే ఈ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ SUVలో అత్యాధునిక ఫీచర్స్‌ను అందించారు. ఎక్స్‌టీరియర్ డిజైన్ ఎంత అందంగా కనిపిస్తుందో, లోపల ఇంటీరియర్ థీమ్ కూడా మరింత ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
లోపల కూర్చున్న ప్రయాణికులకు లగ్జరీ పేరుకు అనుగుణంగా బెస్ట్ ఫీలింగ్‌ను అందిస్తుంది. సీటింగ్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇది పవర్ అడ్జస్టబుల్ ఎక్స్‌టీరియర్ రియర్‌వ్యూ మిర్రర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆప్షనల్‌గా ముందు, వెనుక పవర్ విండోలు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి పలు ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








