1 నేనొక్కడినేలో కెటిఎమ్ డ్యూక్ 200పై మహేష్ బాబు
సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మన ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం '1 నేనొక్కడినే'. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఓ టీజర్ వీడియోను, ఫొటోను సదరు నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియోకు యూట్యూబ్‌లో 8 లక్షలకు హిట్‌లు వచ్చాయి. లేటెస్ట్ టీజర్‌ను బట్టి చూస్తుంటే, మహేష్ ఖాతాలో మరో పోకిరి చిత్రం లాంటి హిట్ పడటం ఖాయమని తెలుస్తోంది.
మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ టీజర్ పోస్టర్, వీడియోలను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మహేష్ మునుపటి కన్నా స్టయిలిష్‌గా, మ్యాన్లీగా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 1 నేనొక్కడినే చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ చిత్రం విడుదల కావచ్చని అంచనా. సరే ఇదంతా అటుంచితే, 1 నేనొక్కడినే చిత్రం టీజర్ పోస్టర్, వీడియోలను బట్టి చూస్తే, ఈ చిత్రంలో మన ప్రిన్స్ స్టయిలిష్ స్పోర్ట్స్ బైక్‌పై కనిపించనున్నాడు.

మహేష్ బాబు - 1 నేనొక్కడినే
సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మన ప్రిన్స్ మహేష్ బాబు '1 నేనొక్కడినే' చిత్రానికి సంబంధించి 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఇటీవలే ఓ టీజర్ వీడియోను, ఫొటోను విడుదల చేసింది.

1 నేనొక్కడినే పోస్టర్
14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ విడుదల చేసిన 1 నేనొక్కడినే పోస్టర్.

మహేష్ బాబు - కెటిఎమ్ డ్యూక్ 200
1 నేనొక్కడినే చిత్రంలో మన ప్రిన్స్ ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్ మేకర్ కెటిఎమ్ భారత మార్కెట్లో అందిస్తున్న తమ లేటెస్ట్ స్పోర్ట్ బైక్ 'డ్యూక్ 200'పై కనిపించనున్నాడు.

పన్ కళ్యాణ్ - కెటిఎమ్ డ్యూక్ 200
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'లో కూడా మన హీరో "కెటిఎమ్ డ్యూక్ 200"పై కనిపించాడు.

ఆటో ఎక్స్‌పో
గడచిన సంవత్సరం జనవరి నెలలో బజాజ్ ఆటో ఈ సరికొత్త కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

ఆఫ్-రోడింగ్
అడ్వెంచర్లకు, డ్రాగ్ రేసింగ్‌లకు, పవర్‌ఫుల్ బైక్ స్టంట్‌లకు అనువుగా ఉండే ఈ కెటిఎమ్ డ్యూక్ 200 స్పోర్ట్స్ బైక్‌ను మంచి హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటుంది.

ఇంజన్
కెటిఎమ్ డ్యూక్ 200 ఆఫ్-రోడ్ బైక్‌లో ఉపయోగించిన 200సీసీ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్లు
కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌లో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 10.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

ధర
కెటిఎమ్ డ్యూక్ 200 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.3 లక్షలుగా ఉంది.
టీజర్ వీడియో
ఇది ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్ మేకర్ కెటిఎమ్ భారత మార్కెట్లో అందిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్ బైక్ 'డ్యూక్ 200'. ఆఫ్ రోడ్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ బైక్‌ను అందిస్తుంది. ఇందులో 200సీసీ, 4-వాల్వ్ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూలింగ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ డిఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కెటిఎమ్ డ్యూక్ 200 కేవలం 9.01 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 10.5 లీటరల్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. పవన్ కళ్యాన్ నటించిన 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రంలో కూడా పవన్ ఇలాంటి ఓ బైక్‌పై కనిపించడం మనం అందరం చూశాం.


Click it and Unblock the Notifications








