రేంజ్ రోవర్ కారులో ప్రీమియర్ షోకి వచ్చిన మహేష్..

సరే ఇదంతా అలా ఉంచింతే.. మహేష్ తాను నటించిన దూకుడు చిత్రం ప్రీమియర్ షోను వీక్షించేందుకు, ప్రిన్స్ సతీమణి నమ్రతా శిరోద్కర్ బహుకరించిన తెలుపురంగు రేంజ్ రోవర్ వోగ్ కారులో సతీసమేతంగా విచ్చేశారు. గతేడాది ఆగస్టులో మహేష్ పుట్టిన రోజు కానుకగా నమ్రతా ఈ రేంజ్ రోవర్ వోగ్ 3.6 టిడి వీ8 కారును బహుమతిగా ఇచ్చింది.
ఈ కారు ధర ఎంతో తెలుసా సుమారు కోటికి పైమాటే. పూర్తిగా విదేశాల్లో తయరైన ఈ కారును సిబియూ రూట్లో దిగుమతి చేసుకున్నారు. ఇలా దిగుమతి చేసుకున్న కార్లపై అధిక సుంఖాల కారణంగా వీటి కొనుగోలు వ్యయం తడిసి మోపెడవుతుంది. ప్రస్తుతం రేంజ్ రోవర్ బ్రాండ్‌ను 2008లో టాటా మోటార్స్ స్వాధీనం చేసుకుంది. ఏదేమైనప్పటికీ, ప్రిన్స్ తగిన కారు అనిపించుకోవాలంటే ఆ మాత్రం చెల్లించక తప్పదు మరి..!


Click it and Unblock the Notifications








