శ్రీవారికి డ్యూరో డిజెడ్ స్కూటర్‌ను బహుకరించిన మహీంద్రా

TTD - Mahindra Duro DZ
పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో నెలకొన్ని ఏడుకొండల వెంకకటేశ్వర స్వామికి ఓ కొత్త స్కూటర్ గిఫ్ట్‌గా లభించింది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ తాజా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త "డ్యూరో 125 డిజెడ్" స్కూటర్‌ను తిరుమల తిరుపతి దేవస్థానానికి బహుమతిగా సమర్పించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మునిరత్నం రెడ్డికి మహీంద్రా టూవీలర్స్ రీజినల్ మేనేజర్ (ఆంధ్రప్రదేశ్) కె. వెంకటేష్ ఈ స్కూటర్‌ తాళం చెవులను అందజేశారు.

ఇక డ్యూరో డిజెడ్ స్కూటర్ విషయానికి వస్తే.. ఇది శక్తివంతమైన 125సీసీ ఇంజన్‌ను కలిగి ఉండి ఇన్‌స్టాంట్ పికప్‌ను అందిస్తుంది. గతుకుల రోడ్లపై సైతం సౌకర్యంగా ప్రయాణించేలా అభివృద్ధి చేసిన మెరుగైన టెలిస్కోపిక్ సస్పెన్షన్, సాటిలేని మైలేజ్, పొడవాటి వీల్‌బేస్, 20 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఎన్నో విశిష్ట ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం.

అంతేకాకుండా, రాత్రివేళ్ల మంచి కాంతినిచ్చే హాలోజన్ బల్బ్‌తో కూడిన వెడల్పాటి హెడ్ లైట్, సురక్షితమైన బ్రేకింగ్ కోసం అమర్చిన బ్రేక్ లీవర్ లాక్, వస్తువులను భద్రపరచుకునేందుకు ముందు వైపు స్టోరేజ్ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా ఆకర్షనీయమైన ధరకే కంపెనీ ఈ స్కూటర్‌ను అందిస్తుంది.

ఈ స్కూటర్ ధర రూ.44,640 (ఎక్స్‌-షోరూమ్, హైదరాబాద్). ఇది లీటరు పెట్రోల్‍‌కు 53 కి.మీ మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 13, 2012, 12:42 [IST]
English summary
Mahindra Group's two-wheeler arm Mahindra 2 Wheelers has gifted its launched the Mahindra Duro DZ 125cc scooter to TTD. Mahindra Duro DZ is available with the price tag of Rs 44,640 (Ex Showroom, Hyderabad.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+