మహీంద్రా నుంచి కార్లు మాత్రమే కాదు విమానాలు కూడా..!

"భారత్‌లో దాదాపు 150 మిలియన్ల మంది యాత్రికులు మరియు 150 మిలియన్ల మంది పర్యాటకులు దేశంలో ప్రయాణిస్తుంటారు. ఈ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను 10-18 సీటర్ ప్లేన్‌లను ప్రవేశపెట్టడం ద్వారా దక్కించుకోవాలనుకుంటున్నామ"ని మహీంద్రా అండ్ మహీంద్రా (సిస్‌టెక్ సెక్టార్) అధ్యక్షుడు హేమంత్ లౌత్రా తెలిపారు.
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ మరియు మహీంద్రా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎన్ఎమ్5 అనే ఫైవ్-సీట్ పిస్టన్-ఇంజన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మహీంద్రా పరిచయం చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రోటోటైప్ సిద్ధంగా ఉందని, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రీ-ఫ్లైట్ ట్రైల్స్ నిర్వహిస్తున్నామని లౌరా తెలిపారు.
ఈ ఏయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కోసం మరిన్ని సౌకర్యాలను అమర్చుకునేందుకు కోసం వచ్చే మూడేళ్లలో రూ. 450 కోట్లకుపైగా పెట్టుబడులను కంపెనీ వెచ్చించనుంది. బెంగుళూరుకు 40 కి.మీ. దూరంలో ఉన్న నసరపురాలో ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నామని మహీంద్రా ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ మెహ్రా తెలిపారు.


Click it and Unblock the Notifications








