రక్షణ హెలికాఫ్టర్ల కోసం ఎయిర్‌బస్ తో చేతులు కలిపిన మహీంద్రా
మేకిన్ ఇండియాలో భాగంగా భారత్ కు చెందిన మహీంద్రా మరియు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ సంస్థలు రెండు కూడా రక్షణ రంగానికి కావాల్సిన హెలికాఫ్టర్లను భాగస్వామ్యంగా తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Also Read: భారత్‌లో గల టాప్-10 బెస్ట్ ఎయిర్‌లైన్స్
దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఇరు దేశాల మధ్య దాదాపుగా 16 వరకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో ఈ రక్షణ హెలికాఫ్టర్ల గురించి కూడా ఒప్పందం కుదిరింది.

ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ బస్ విమాన తయారీ సంస్థతో భారత్‌కు చెందిన మహీంద్రా సంస్థ రక్షణ విమానాల తయారీ కోసం చేతులు కలిపింది.

అంతే కాకుండా త్రీ మెమోరాండమ్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU) అనే ఒప్పందం కూడా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో ట్రాన్స్‌పోర్ట్, నీరు మరియు మురుగు శుద్ది మరియు సౌర శక్తి వంటివి ముఖ్యంగా ఉన్నాయి.

ప్రధాన మంత్రి చొరవ తీసుకుని ఛండీఘర్, నాగ్‍పూర్ మరియు పుదుచ్చేరి నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చేయడానికి కూడా ఫ్రాన్స్‌తో ఒప్పంద కుదుర్చుకున్నట్లు తెలిసింది.

ప్రపంచ స్థాయి నాణ్యతో హెలికాఫ్టర్లను తయారు చేయడానికి ఈ ఒప్పదం ఎంతో కీలంకంగా ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా వారు తెలిపారు.

అంతే కాకుండా రక్షణ హెలికాఫ్టర్లను మరియు ఛాపర్లను దేశీయంగా తయారు చేయనున్నట్లు ఈ సందర్భంగా మహీంద్రా అధికారులు తెలిపారు.

- మృదువైన పక్షి ఢీ కొంటే పతనమవుతున్న విమానాలు: దీని వెనకున్న మర్మం ఏమిటి...?


Click it and Unblock the Notifications








