Nikhath Zareen: బాక్సింగ్ బంగారానికి షాకిచ్చిన మహీంద్రా & మహీంద్రా

దేశ‌ రాజ‌ధాని ఢిల్లీలో జరుగుతున్న మహిళల ప్ర‌పంచ‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ పసిడిని సాధించింది. 50 కిలోల విభాగంలో స్వ‌ర్ణం సాధించిన నిఖ‌త్.. ఈ విజయంతో వరుసగా రెండోసారి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన రెండో భారత బాక్సర్ గా చరిత్ర సృష్టించింది.

ప్రపంచం బాక్సిక్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించడంతో దేశ ప్రజల నుంచి ఆమెకు ప్ర‌శంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు సరికొత్త థార్ SUVని మంహీంద్రా & మహీంద్రా బహుమతిగా ఇచ్చింది. ఆమె గెలుపునకు నిదర్శనంగా దీనిని బహుకరిస్తున్నట్లు పేర్కొంది.

నిఖత్ జరీన్

ఊహించలేదు.. జరీన్
జరీన్ గెలిచిన వెంటనే థార్ SUVని బహుమతిగా ఇస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ విషయాన్ని పంచుకుంటూ "మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్‌కు అభినందనలు తెలియజేసింది. సరికొత్త ఆల్-న్యూ థార్ ఆమె విజయానికి ప్రతీకగా బహుకరిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఈ విజయంతో వచ్చిన ప్రైజ్ మనీతో ($100,000) మొదటగా ఆమె మెర్సిడెస్ కారును కొనుగోలు చేయాలని భావించింది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించింది. అనంతరం మహీంద్రా అధునాతన థార్ SUVని గిఫ్ట్ గా ఇచ్చిందని తెలుసుకుని ఆ ఉద్దేశాన్ని మార్చుకుంది. ఇదీ అస్సలు ఊహించడం లేదని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

మెర్సిడెస్ కారు కొనుగోలు చేయలన్నా తన ప్రణాళికలను మార్చుకున్నట్లు ఆమె వెల్లడించింది. తన తల్లిదండ్రులను 'ఉమ్రా' మక్కాలాంటి తీర్థయాత్రలో చేసే (పుణ్యకార్యాలు) చేయడం కోసం డబ్బును ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్ లో ఇలాంటి ప్రోత్సాహకాలు క్రీడాకారులకు స్పూర్తినిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

నిఖత్ జరీన్

బహుమతులతో ప్రోత్సాహిస్తున్న మహీంద్రా..
గతంలో కూడా, మహీంద్రా అండ్ మహీంద్రా దేశం కోసం పతకాలు సాధించి పెట్టిన భారతీయ అథ్లెట్లను ప్రోత్సహించడానికి సరికొత్త మోడళ్లను బహుమతిగా ఇచ్చింది. వీటిని బహుకరించిన అథ్లెట్లలో అత్యంత ప్రముఖ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు కూడా ఉన్నారు. నీరజ్ చోప్రాకు తమ టాప్ ఫ్లాగ్ షిప్ లోని SUV XUV 700ను గిఫ్ట్ గా ఇచ్చింది. ఇలా ఎంతో మందిని మహీంద్రా ప్రోత్సాహిస్తూ వస్తోంది.

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ద్వారా మన దేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టి ప్రపంచ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించేలా క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నట్లు మహీంద్రా & మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా తెలిపారు. ముఖ్యంగా దేశంలో యవతుల్లో క్రీడా ప్రతిభ వెలికి తీసేందుకు ఇది ఉపకరిస్తుందని ఆయన అన్నారు. 'రోడ్ టు గోల్డ్' కార్యక్రమం చాలా మంది యువతులు వారి కలలను సాకారం చేసుకునేలా స్ఫూర్తినిస్తుందని మేము నమ్ముతున్నామని చెప్పారు.

నిఖత్ జరీన్

శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులు..
వియత్నాం బాక్సర్ నుయెన్ పై 5-0 తేడాతో విజయంతో బంగారు పతకం సాధించిన జరీన్ ను దేశ ప్రధానితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, ముఖ్య ప్రముఖులు అభినందించారు. తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జరీన్ తన వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రాభవాన్ని మరోసారి చాటారని ఆయన అన్నారు.

దేశ రాజధానిలో జరుగుతున్న ఈ 2023 ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు అంతర్జాతీయ స్థాయిలో ఆధిపత్యం చెలాయించారు. ఎనిమిది మంది బాక్సర్లు క్వార్టర్ ఫైనల్స్‌లో నలుగురు పతక రౌండ్‌లకు అర్హత సాధించారు. 4 బంగారు పతకాలతో 63 దేశాలను వెనక్కి నెట్టి పతకాల పట్టికలో భారత్ తొలి స్థానంలో కొనసాగుతోంది.

More from DriveSpark

Article Published On: Monday, March 27, 2023, 13:41 [IST]
English summary
Mahindra and mahindra has rewarded world boxing champion nikhat zareen with a brand new thar suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+