Mahindra Bolero నీకు నీవే సాటి; ఎందుకో వీడియో చూడండి

భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీదారు అయిన Mahindra And Mahindra యొక్క వాహనాలు ప్రజల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. ఈ కారణంగానే ఎక్కువమంది వాహన వినియోగదారులు మహీంద్రా వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతారు. ఇందులో మహీంద్రా యొక్క Bolero ఒకటి. Mahindra Bolero ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించాడనికి అనుకూలంగా ఉంటుంది.

Mahindra Bolero నీకు నీవీ సాటి; ఎందుకో వీడియో చూడండి

ఇటీవల భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు ఏర్పడ్డాయి. ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి, అంతే కాకుండా రోడ్లు కూడా వర్షపు నీటితో నిండిపోయాయి. ఈ కారణంగా వాహనదారులు చాలా ఎదుర్కొంటున్నారు.

Mahindra Bolero నీకు నీవీ సాటి; ఎందుకో వీడియో చూడండి

మన దేశంలో చాలా రోడ్లు గుంటలతో నిండి ఉన్నాయి. వర్షాకాలంలో ఈ రోడ్లు పరిస్థితి వర్ణనాతీతం. వాహనదారులో ఇలాంటి రోడ్డులో ప్రయాణించడం నిజంగా ఒక సవాలు అనే చెప్పాలి. కొన్నిసార్లు వాహనాన్ని రోడ్డుపై వదిలేసి ఇంటికి రావాల్సిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోవడాన్ని మనం ఇదివరకు చాలా చూసి ఉంటాము.

Mahindra Bolero నీకు నీవీ సాటి; ఎందుకో వీడియో చూడండి

ఇదిలా ఉండగా, భారీ వర్షం కారణంగా Mahindra Bolero నీటితో నిండిన రహహదారిపై వెళ్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో మహీంద్రా కంపెనీ చైర్మన్ Anand Mahindra ను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ట్విట్టర్ మరియు యూట్యూబ్‌తో సహా అనేక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయబడింది.

Mahindra Bolero నీకు నీవీ సాటి; ఎందుకో వీడియో చూడండి

ఈ వీడియోలో మీరు రోడ్డు మీద ప్రవహించే వరదనీటిని చూడవచ్చు. వీడియోలోని సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగినట్లు చెబుతున్నారు. ఈ వీడియోను గుజరాత్ పోలీసులు మరియు ఆనంద్ మహీంద్రా ట్యాగ్ చేశారు. ఈ వీడియోను 'మహీంద్రా హై మమ్కిన్ హైకి' రాశారు.

Mahindra Bolero నీకు నీవీ సాటి; ఎందుకో వీడియో చూడండి

ఇక్కడ మీరు వీడియోలో గమనించినట్లైతే రోడ్డు చాలా వర్షపు నీటితి నిండి ఉంది. వరదలా తలపించే ఈ వీడియోలో Mahindra Bolero అవలీలగా వెళుతోంది. వైట్ కలర్ Mahindra Bolero ఆ నీటి గుండా వెళ్లడం మీరు ఇక్కడ గమనించవచ్చు. బొలెరో కారు బోనెట్‌కి నీరు చేరుతుంది. అయినా బొలేరో ఆగకుండా ముందుకు వెళుతూనే ఉంది. ఈ Mahindra Bolero గుజరాత్ పోలీసులకు చెందినది.

Mahindra Bolero నీకు నీవీ సాటి; ఎందుకో వీడియో చూడండి

ఈ వీడియోపై Anand Mahindra స్పందిస్తూ, ఈ సంఘటన చూసి నిజంగా నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అని తెలిపారు. ఈ వీడియోను చాలామంది లైక్ చేసి వారికి తోచిన విధంగా కామెంట్స్ కూడా చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 3,000 లైక్స్ మరియు 320 కి పైగా రీట్వీట్లు వచ్చాయి.

Mahindra Bolero నీకు నీవీ సాటి; ఎందుకో వీడియో చూడండి

Mahindra Bolero భారతీయ మార్కెట్లో అనేక సంవత్సరాలుగా బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడైన వాహనం. Mahindra Bolero (మహీంద్రా బొలెరో) ప్రత్యేకించి భారతదేశంలోని చిన్న పట్టణాలు మరియు గ్రామాలలో ఎక్కువమంది ఇష్టపడే SUV గా నిలిచింది.

Mahindra Bolero నీకు నీవీ సాటి; ఎందుకో వీడియో చూడండి

Mahindra కంపెనీ ఇటీవల Mahindra Bolero Neo వెర్షన్‌ని విడుదల చేసింది. ఇది Mahindra TUV300 యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ కూడా అదే నమ్మకమైన అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. కానీ Bolero Neo మహీంద్రా బొలెరో కాదు. కానీ కంపెనీ మహీంద్రా బోలెరోని త్వరలో అప్డేట్ చేస్తుంది.

Mahindra Bolero SUV లో 1.5 లీటర్ సామర్థ్యం కలిగిన MHOC 75 BS6 డీజిల్ ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజన్ గరిష్టంగా 75 బిహెచ్‌పి పవర్ మరియు 210 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఈ SUV ఆఫ్-రోడ్ మోడ్‌కి ప్రత్యేకమైనది కానప్పటికీ, కఠినమైన రోడ్లతో కూడా సులభంగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

Mahindra Bolero నీకు నీవీ సాటి; ఎందుకో వీడియో చూడండి

మహీంద్రా బొలెరో SUV భారతదేశంలో రెండు మోడళ్లలో విక్రయించబడింది. BS6 బొలెరో SUV ధర రూ. 9.39 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా ఇష్టమైన వాహనం, అందుకే ఇప్పటి వరకు కూడా మంచి ప్రజాదరణతో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

భారతదేశంలో చాలా ఎక్కువ వర్షాలు కావున వరదలు ఎక్కువగా వస్తున్నాయి. అనేక వాహనాలు ఈ చిక్కుకుని చాల అవస్థలు పడుతున్నాయి. కావున వాహనదారులు చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే వాహనం ఆ వర్షపు నీటిలో చిక్కుకునే ప్రమాదం ఉంది.

Most Read Articles

English summary
Mahindra bolero suv moves in flooded road video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X