భారత్‌లో మహీంద్రా చిన్న విమానాల ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్
ఎస్‌యూవీల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా విమానయాన రంగంపై కూడా దృష్టి సారించిన సంగతి తెలిసినదే. గడచిన రెండేళ్లు చిన్న తరహా విమానాలపై పనిచేస్తోన్న మహీంద్రా గ్రూప్, ఇప్పుడు తమ లైట్ వెయిట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను త్వలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది.
మహీంద్రా గ్రూపుకు చెందిన విమానయాన విభాగం మహీంద్రా ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన 'జిఏ 10' అనే తేలికపాటి విమానాన్ని కంపెనీ ఇప్పటికే అనేకసార్లు వియవంతంగా పరీక్షించింది. మహీంద్రాకు చెంది ఆస్ట్రేలియన్ అనుబంధ కంపెనీ మహీంద్రా జిప్స్‌ఏరో ఈ సింగిల్ టర్బో-ప్రోప్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేసింది. కాగా.. ఆస్ట్రేలియాలో తయారైన ఈ విమానాలు ఇండియాలో ప్రవేశపెట్టేందుకు మహీంద్రాకు అనుమతి లభించింది.

సింగిల్ పిస్టన్ ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్ సర్టిఫికేషన్‌కు సంబంధించి తమ కంపెనీకి, విమాన నియంత్రణ సంస్థ డిజిసిఎకి మధ్య నెలకొన్న అనిశ్చితికి తెరపడడడంతో తమ విమానాలు దేశీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమమైందని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా చెప్పారు. పిస్టన్ ఇంజన్ విమానంలో ఎంత మంది ప్రయాణించాలనే దానిపై స్పష్టత లేకపోడంతో ఇన్ని సంవత్సరాలపాటు భారత మార్కెట్లోకి ప్రవేశించలేకపోయామని మహీంద్రా గ్రూప్ తెలిపింది.

అయితే, నిబంధనల్లో మార్పు కారణంగా తమ విమానాలకు ఆమోదం లభించిందని, ఈ విమానాల్లో 5 నుంచి 10 సీట్లు ఉంటాయని కంపెనీ వివరించింది. మహీంద్రా జిఏ 10 ఎయిర్‌క్రాఫ్ట్‌లో రోల్స్ రాయిస్ 250 టర్బో ప్రోప్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ విమానంలో 10 సీట్లు ఉంటాయి. సింగిల్ పిస్టన్ ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్ సర్టిఫికేషన్ కోసం యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిసేట్రషన్ ఇచ్చిన నిబంధనలను డిజిసిఎ అంగీకరించిందని, ఈ నేపథ్యంలో తమ ప్రతిపాదనకు పౌర విమానయా శాఖ పచ్చ జెండా ఉపిందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








