గూగుల్‌ మ్యాప్స్‌ తప్పిదం.. షార్ట్‌కట్‌ను అనుసరిస్తూ బోల్తా పడిన కారు..

టెక్నాలజీ, స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో లేని కాలంలో ఎవరైనా కొత్త ఊరు వెళ్లాల్సి వస్తే.. దారి పొడవునా అడ్రస్‌ అడుగుతూ వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, నెట్‌ ఉంటే చాలు.. తెలియని ప్రదేశాలను గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో సులభంగా చేరుకోవచ్చు. ఇప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులు లేరంటే అతిశయోక్తి కాదు.

నగరాల్లోనే కాదు గ్రామాలకు కూడా గూగుల్‌ మ్యాప్స్‌ సేవలు విస్తరించాయి. కానీ ఇటీవల గూగుల్‌ మ్యాప్స్‌ కారణంగా కొందరు బోల్తా పడిన సంఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. డ్రైవింగ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ కీలకంగా మారింది. అలా గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో ఓ కొత్త ప్రాంతానికి వెళ్తున్న పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది.

Accident after Following Google Maps

కేరళలోని కూరాచుండులో మహీంద్ర ఎంఎం 540 కారులో ఐదుగురు బృందం వయలాడ ముల్లన్‌పర పర్యాటక కేంద్రానికి బయలుదేరారు. దారి తెలియని ప్రాంతం కావడంతో గూగుల్‌ మ్యాప్స్‌ ఆన్‌ చేసి కారు స్టార్ట్‌ చేశారు. గూగుల్‌ మ్యాప్స్‌ సూచించిన మార్గంలో బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో వాయలాడకు షార్ట్‌కట్‌ రూట్‌ చూపించింది. వారికి ఆ రూట్‌ తెలయదు కాబట్టి అదే ఫాలో అవుతూ వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఆ రూట్లో రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉండటంతో కారు బోల్తా పడింది. MM540 కారు టైరు స్కిడ్‌ అవడంతో అదుపు తప్పి పక్కకి బోల్తా పడింది. వాహనం డ్యామేజ్‌ అయినా అదృష్టవశాత్తు కారులో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తన్నియంకున్‌ నుంచి వాయలాడ మార్గంలో రహదారి సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

సంఘటనను గమనించిన స్థానికులు వారికి సాయం చేశారు. బోల్తా పడిన కారును పైకి లేకేందుకు యత్నించారు. ఇలాంటి కొత్త మార్గాల్లో వెళ్లేటప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌ కంటే స్థానికుల సాయం తీసుకోవడం ఉత్తమం.. ఎందుకంటే అక్కడి రోడ్ల పరిస్థితి స్థానికులకే బాగా తెలుస్తుంది.

ఇటీవల సైతం ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గూగుల్‌ మ్యాప్స్‌ను అనుసరిస్తూ ఓ వ్యక్తి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కారు డ్రైవర్‌కు రూట్‌ తెలియకపోవడంతో మ్యాప్స్‌పై ఆధారపడ్డాడు. అర్ధరాత్రి దాటాక అది సూచించిన మార్గంలో వెళ్తుండగా వంతెన మీదుగా వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ వంతెన నీటిలో మునిగిపోయింది.

ఈ విషయం తెలియకపోవడంతో డ్రైవర్‌ అలాగే వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు ఆ వంతెన మీదుగా వెళ్తుండగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులకు ఈ వంతెన మునిగి ఉన్న సంగతి తెలిసి ఆ మార్గం ద్వారా రాకపోకలు ఆపేశారు. కానీ వంతెన పరిస్థితి గూగుల్‌ మ్యాప్స్‌లో అప్‌డేట్‌ కాకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. అంతే కాకుండా అధికారులు సైతం ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.

అదేవిధంగా మరో సంఘటనలో టాటా హ్యారియర్‌ కారు నడుపుతున్న వ్యక్తి గూగుల్‌ మ్యాప్స్‌ను అనుసరించి చిక్కుల్లో పడ్డాడు. పూణే నుంచి నాగ్‌పూర్‌కు కారులో బయలుదేరుతూ నావిగేషన్‌ కోసం గూగుల్‌ మ్యాప్స్‌ను అనుసరించాడు. త్వరగా వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వెళ్తుండగా.. ఓ కొత్త రూట్‌లోకి వెళ్లారు. ఆ మార్గంలో దెబ్బతిన వంతెనతో కూడిన చిన్న నది వద్దకు కారు చేరుకుంది.

ఆ వంతెనకు ఎడమవైపుగా ప్రయాణిస్తూ నది దాటాలని నిర్ణయించుకున్నారు. దానికి అనువుగా ఉన్న మార్గం ద్వారా వెళ్తుండగా దురదృష్టవశాత్తు కారు బురదలో ఇరుక్కుపోయింది. ఏదైమైనా నగరాల్లో గూగుల్‌ మ్యాప్స్‌ను అనుసరిస్తూ వెళ్లడం సులభమైనా.. పర్యాటక ప్రాంతాలు, కొత్త మార్గాల్లో వెళ్లేటప్పుడు మాత్రం గూగుల్‌ మ్యాప్స్‌ కంటే కూడా స్థానికుల సలహాలు తీసుకోవడం సరైనది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 7, 2023, 17:14 [IST]
English summary
Mahindra mm 540 car overturns on damaged road after following google maps
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+