Mahindra స్కార్పియో N ప్రమాదంలో డ్రైవర్ కాలు విరిగిన ఘటనపై అధికారిక ప్రకటన చేసిన సంస్థ
మహీంద్రా స్కార్పియో N SUV ప్రమాదం ఇటీవల తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనలో కారు డ్రైవింగ్ చేస్తున్న యజమాని తన కుడి కాలును కోల్పోయారు. మెకానికల్ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని యజమాని ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిగిన మహీంద్రా సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కొన్ని రోజుల క్రితం పూణేలో మహీంద్రా స్కార్పియో N వాహనంలో ( Mahindra scorpio N SUV ) ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రోడ్డు పక్కనున్న బారియర్‌ను ఢీకొట్టారు. ప్రమాద తీవ్రతకు కారు ఫ్రంట్ వీల్ బయటకు వచ్చేసింది. ఈ ప్రమాదంలో కారును డ్రైవింగ్ చేస్తున్న యజమాని కుడి కాలును కోల్పోయారు. అయితే ఈ ఘటన అనంతరం కారులో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనపై కారు యజమాని మహీంద్రా సంస్థకు ఫిర్యాదు చేశారు. మెకానికల్ వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఫిర్యాదుపై మహీంద్రా సంస్థ సమగ్ర విచారణ జరిపింది. ఘటనపై అధికారిక ప్రకటన చేసింది. వాహనం యొక్క కనెక్ట్ చేయబడిన కార్ సర్వర్ డేటా ఆధారంగా ప్రమాద సమయంలో కారు గరిష్ఠంగా 105-122 kmph వేగంతో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
మహీంద్రా స్కార్పియో N SUV.. 120 కి.మీ వేగంతో ఢీకొనడం వల్ల గణనీయరీతిలో 1350 kj శక్తిని ఉత్పత్తి చేసిందని సంస్థ పేర్కొంది. ఈ శక్తి సాధారణం కంటే రెండింతలు ఎక్కువ. ఈ కారణంగా ప్రమాద తీవ్రత పెంచుతుందని తెలిపింది. ఈ అధిక వేగంతో ఢీకొట్టడంతో ఫ్రంట్ వీల్ జాయింట్లు వేరుచేయబడ్డాయని సంస్థ పేర్కొంది. వాహనం ఢీకొట్టేందుకు ముందు టైర్ వేరుచేయబడినట్లు రహదారిపై ఎటువంటి గీతలు లేనవి స్పష్టం చేసింది.

ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో N వాహనం డీలర్‌షిప్ పరిధిలో ఉందని పేర్కొంది. ఈ ఘటనను దాచిపెట్టడం లేదా తక్కువ చేసి చూపడం వంటి ఉద్దేశాలు లేవని స్పష్టం చేసింది. తమ కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు కచ్చితత్వం, పారదర్శకత కోసం తన నిబద్దతను పునరుద్ఘాటిస్తుందని పేర్కొంది. ఈ ఘటనపై వచ్చిన ఆరోపణలకు తమ సమగ్ర విచారణ నివేదిక సరైన ప్రతిస్పందనగా ఉంటుందని సంస్థ తెలిపింది.
ప్రస్తుతం ఈ కేసు అధికారుల సమక్షంలో ఉందని, మహీంద్రా సంస్థ వినియోగదారుని అవసరాలకు అనుగుణంగా నిరంతర సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. మహీంద్రా వాహనాల వినియోగదారుల భద్రతను నిర్దారించడానికి మరియు దాని ప్రక్రియలో పారదర్శకతను కొనసాగించేందుకు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుందని తెలిపింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








