ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదు.. ఆనంద్‌ మహీంద్రాకు కారు యాజమాని ట్వీట్‌

కొన్ని రోజుల క్రితం మహీంద్రా స్కార్పియో -N వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. స్కార్పియో - N SUV చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు రూఫ్‌ విరిగిపోయింది. ఈ కారులోని ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.

అయితే స్కార్పియో-N నాణ్యతపై మహీంద్రా సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాకు కారు యాజమాని ఫిర్యాదు చేశారు. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని, భవిష్యత్‌తో వచ్చే కార్ల నాణ్యతపై దృష్టిపెట్టాలని ట్వీట్‌ చేశారు. మహీంద్రా స్కార్పియో-N డ్రైవర్‌ నిద్రపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని సమాచారం.

Mahindra Scorpio-N

వాహనం అటవీ ప్రాంతం మధ్యలో వెళ్తున్నప్పుడు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టింది. కారు భారీగా దెబ్బతినగా.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. టాప్‌ ఎండ్‌ మహీంద్రా స్కార్పియో-N Z8 వేరియంట్‌ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఏ ఒక్క ఎయిర్‌బ్యాగ్‌ కూడా తెరుచుకోలేదని కారు యాజమాని ఆరోపిస్తున్నారు.

ఎయిర్‌బ్యాగ్‌లు ఎలా పనిచేస్తాయో చూద్దాం.. ఎయిర్‌బ్యాగ్‌ ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ (ECU) సెన్సార్ల నుంచి సిగ్నల్‌ను గుర్తించినప్పుడు.. అందుకు అనుగుణంగా ఎయిర్‌బ్యాగ్‌ ట్రిగ్గరింగ్‌ సర్క్యూ్ట్‌ను యాక్టివేట్‌ చేస్తుంది. సెన్సార్ల నుంచి వచ్చిన సిగ్నల్‌ ఆధారంగా ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోవాలా వద్దా అనేది ఆటోమేటిక్‌గా నిర్ణయిస్తుంది.

అయితే సెన్సార్‌ల నుంచి తగిన స్థాయిలో సిగ్నల్‌ రాకుంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకునే అవకాశం ఉండదు. అంటే 20 కి.మీ వేగంలో కారు ఓ గోడను ఢీకొట్టినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుకుకొనే అవకాశం ఉంటుంది. అదే 40 కి.మీ వేగంతో కారు ఓ పెద్ద స్పాంజిని ఢీకొడితే.. ఈ సందర్భంలో ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోవు. ఎందువల్ల అంటే సెన్సార్లకు తగినంత స్థాయిలో సిగ్నల్‌ ఇవ్వకుంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనే అవకాశం ఉండదు.

Mahindra Scorpio-N

అదే విధంగా వాహనం జారిపోయిన సందర్భంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనే అవకాశం లేదు. రోల్‌ఓవర్‌ సెన్సార్‌.. కారు బోల్తాపడడాన్ని గుర్తించకపోతే కర్టెన్‌ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనే అవకాశం ఉండదు. కారు బోల్తా పడిన సమయంలో సైడ్‌ ఇంపాక్ట్‌ సెన్సార్లు గుర్తించి, ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవాలి. మహీంద్రా స్కార్పియో విషయంలో ఇలా జరగలేదని అనిపిస్తోంది.

ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోవడం నేరుగా తొలి ఇంపాక్ట్‌పై ఆధారపడి ఉంటుంది. మరియు ఎయిర్‌బ్యాగ్‌లు పేలుడు మూలకాలను కలిగి ఉంటాయి. అందువల్ల ‌ప్రయాణికులు సరైన స్థితిలో కారులో లేనప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటే.. జరిగే మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుంది. ప్రయాణికులు గాయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

G-NCAP రేటింగ్‌ ప్రకారం.. మహీంద్రా స్కార్పియో -N పెద్దల భద్రతలో 34 పాయింట్లకు గాను 29.25 సాధించింది. అదే చిన్నారుల రక్షణలో 48 పాయింట్ల 28.94 సాధించింది. మరియు సైడ్‌ ఇంపాక్ట్‌ పరీక్షలో మహీంద్రా స్కార్పియో -N వాహనం మంచి రేటింగ్‌ను కలిగి ఉంది.

గ్లోబల్‌ N-CAP నిర్ధారణలో మహీంద్రా స్కార్పియో -N డ్రైవర్, ఇతర ప్రయాణికుల మెడ భాగాలకు గణనీయమైన రక్షణ అందిస్తుందని తేలింది. అయితే వారి ఛాతి భాగాలకు మాత్రం రక్షణ అంతంత మాత్రంగా ఉంటుందని సమాచారం. కానీ సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్టులో స్కార్పియో -N అత్యధికంగా 17 పాయింట్లకు 16 సాధించింది. సైడ్‌ పోల్‌ ఇంపాక్ట్‌ టెస్టులోనూ మహీంద్రా స్కార్పియో -N ఆమోదయోగ్యమైన రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 15, 2023, 18:14 [IST]
English summary
Mahindra scorpio n airbags not deployed during accident car owner tweets to anand mahindra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+