92 కి.మీ వేగంతో వోక్స్‌వ్యాగన్‌ కారును ఢీకొట్టిన మహీంద్రా స్కార్పియో-N..ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదన్న యజమాని

మహీంద్రా స్కార్పియో-N అత్యంత వేగంతో వోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో స్టార్‌ 5-రేటింగ్‌ కలిగిన స్కార్పియో-N వాహనం సరైన భద్రత కల్పించలేదని యజమాని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం లేదు. ఈ ఘటనపై పూర్తి కథనం మీకోసం.

ఓ ఫ్లైఓవర్‌పై అర్ధరాత్రి వేళలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో స్కార్పియో -N డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ సమయంలో స్కార్పియో సుమారుగా 92 kmph వేగంతో ప్రయాణం చేస్తోంది. ఫ్లైఓవర్‌పై మలుపుల రోడ్డు వద్ద వోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌, టాటా టియాగో కార్లు రోడ్డు మధ్యలో నిలిపి ఉన్నాయి.

Mahindra Scorpio-N car crashed Volkswagen virtus

వేగంగా ప్రయాణిస్తున్న స్కార్పియో కారు డ్రైవర్‌కు.. మలుపు వద్ద నిలిపి ఉంచిన కార్లు కనిపించలేదు. అనంతరం కార్లను గుర్తించినా... తన వాహనాన్ని నియంత్రించే సమయం లేకుండా పోయింది. దీంతో 92 కి.మీ వేగంతో వోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ కారును బలంగా ఢీకొట్టారు. దీంతో స్కార్పియో వాహనం ఛాసిస్‌ డ్యామేజీ అయింది. అయితే ఆ సమయంలో ఆ వోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌, టాటా టియాగో కార్లు నడిరోడ్డుపై ఎందుకు నిలిపి ఉన్నాయో సమాచారం లేదు.

రేసింగ్‌ లేదా రెండు కార్ల డ్రైవర్ల మధ్య వాగ్వాదం జరిగిందా అనేది తెలియలేదు. అర్ధరాత్రి వేళలో ఎక్స్‌ప్రెస్‌ వే పైన ఇలా కార్లను పార్కింగ్ చేసి ఉండడం అత్యంత ప్రమాదకరం. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన అనంతరం టాటా టియాగో కారు అక్కడ నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరైన గాయాపడ్డారా లేదా అనే సమాచారం తెలియలేదు.

ఈ ఘటన అనంతరం స్కార్పియో కారును సమీపంలోని మహీంద్రా సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. సర్వీస్‌ సెంటర్‌ సిబ్బంది ఛాసిస్‌ డ్యామేజీ అయిందని తెలిపారు. అయితే ఈ ఘటన సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని సమాచారం. దీనిపై సర్వీస్‌ సెంటర్ సిబ్బందిని ప్రశ్నించినా.. సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది.

అయితే మహీంద్రా స్కార్పియో -N కారు ఛాసిస్‌ ఆధారంగా 5- స్టార్‌ సేఫ్టీ భద్రతా రేటింగ్‌ను పొందింది. అయినా ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని సమాచారం. ఇది స్కార్పియోలోని భద్రతా లోపాన్ని తెలియజేస్తుంది. నేరుగా ఢీకొట్టినందువల్ల.. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవాల్సి ఉంది.

అయితే మహీంద్రా స్కార్పియో -N, వోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ రెండు కార్లు 5- స్టా‌ర్‌ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. వర్టస్‌ కారు కొత్తగా వచ్చిన కఠినమైన నిబంధనలకు అనుగుణంగా పరీక్షించబడింది. ఈ నిబంధనలకు ముందు స్కార్పియో -N పరీక్షించబడిందని తెలుస్తోంది. తాజా నిబంధనల ప్రకారం మరోసారి పరీక్షలు నిర్వహిస్తే. మహీంద్రా స్కార్పియో-Nలోని లోపాలు బయటపడే అవకాశం ఉంది.

భారత్‌లో కొత్తగా BNCAP రేటింగ్‌ వ్యవస్థను ఆగస్టు 22న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. దేశంలో తయారైన కార్లకు భద్రతా రేటింగ్‌ను ఈ వ్యవస్థ ద్వారా ఇవ్వనున్నారు. ఈ విధానం వల్ల భారత్‌లో తయారయ్యే కార్లకు తక్కువ ఖర్చుతోనే క్రాష్‌ టెస్టు్‌ సహా ఇతర పరీక్షలు చేయవచ్చు. GNCAPలో ఉన్న నిబంధనలే.. BNCAPలోనూ ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, August 31, 2023, 16:12 [IST]
English summary
Mahindra scorpio n car crashed volkswagen virtus with 92 kmph speed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+