కారు కొనుగోలుచేసిన వారం రోజులకే విరిగిన సస్పెన్షన్‌ సిస్టమ్‌.. భార్య అరుపులతో ఒక్కసారిగా... !

మహీంద్రా స్కార్పియో-N కొత్త కారు కొనుగోలు యజమానికి చేదు అనుభవం ఎదురైంది. కారు కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే సస్పెన్షన్ సిస్టమ్‌ డ్యామేజీ అయింది. దీంతో కారు యజమాని తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఎక్కుడ జరిగిందనే సమాచారం వెల్లడి కాలేదు.

ఓ వ్యక్తి ఆగస్టు 8 మహీంద్రా స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం కేవలం నగర ప్రాంతంలోనే ప్రయాణం చేశాడు. ఆగస్టు 16న తన భార్యతో కలిగి షాపింగ్‌కు వెళ్లాడు. షాపింగ్‌ మాల్‌ వద్ద పార్కింగ్‌ చేస్తున్న సమయంలో కారు ముందు సస్పెన్షన్‌ విరిగినట్లు గుర్తించిన అతని భార్య.. వాహనాన్ని వెంటనే నిలపాలని గట్టిగా అరిచింది.

Mahindra Scorpio N car suspension system broken

దీంతో ఒక్కసారిగా కంగారు పడిన మహీంద్రా స్కార్పియో-N యాజమాని ఆందోళనతో కారు నుంచి బయటకు వచ్చి చూశాడు. కారు సస్పెన్షన్‌ వ్యవస్థ విరిగి, ముందు టైరు బయటకు రావడాన్ని చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే వాహన డీలర్‌ను సంప్రదించాడు. అయితే అప్పటికే రాత్రి 8:30 గంటల సమయం కావడంతో కారు మరమ్మతు చేసేందుకు వీలు కాలేదు.

అయితే పార్కింగ్‌ ప్రాంతంలో ఉన్న కొంత మంది సాయంతో కారును సురక్షిత ప్రాంతంలో నిలిపి ఉంచారు. తర్వాత రోజు మరోసారి డీలర్‌ను సంప్రదించాడు. అయితే షోరూం, కారు ఉన్న ప్రాంతాల మధ్య సుమారు 30 కి.మీ దూరం ఉండడంతో మరమ్మతు చేసేందుకు మెకానిక్‌ పంపేందుకు వీలుకాలేదు.

Mahindra Scorpio N car suspension system broken

అయితే అతికష్టం మీద మెకానిక్ వచ్చి.. మహీంద్రా స్కార్పియో-N కారును తాత్కాలికంగా మరమ్మతు చేశాడు. అనంతరం సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై స్కార్పియో యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వాహనం తక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్న కారణంగా ఎటువంటి ప్రమాదం జరగలేదని, అదే వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో సస్పెన్షన్‌ వ్యవస్థ డ్యామేజీ అయితే భారీ ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశాడు.

మహీంద్రా సర్వీస్‌ సెంటర్‌ సిబ్బంది.. స్కార్పియో-N కారును ఉచితంగా మరమ్మతులు చేశారు. అయితే ఏ కారణంగా వల్ల స్కార్పియో-N వాహనం సస్పెన్షన్‌ వ్యవస్థ డ్యామేజీ అయిందో వెల్లడించలేదు. అయితే క్వాలిటీ కంట్రోల్‌ సిబ్బంది తప్పిందం వల్ల ఈ సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

Mahindra Scorpio N car suspension system broken

కొన్ని రోజుల క్రితం ఓ జాతీయ రహదారిపై వోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ కారును మహీంద్రా స్కార్పియో-N కారు సుమారు 92 కి.మీ వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో మహీంద్రా కారు ఛాసిస్‌ డ్యామేజి అయింది. అయితే ఈ సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని యజమాని ఆరోపించారు. దీనిపై సర్వీస్ సెంటర్‌ సిబ్బందిని ప్రశ్నించినా.. సరైన సమాధానం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 6, 2023, 16:27 [IST]
English summary
Mahindra scorpio n car suspension system broken during driving
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+