Accident యాక్సిడెంట్ లో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్.. ఈ కారు చాలా పవర్ ఫుల్..
ప్రమాదం నుంచి కాపాడే అత్యంత సురక్షితమైన కార్లుగా మహీంద్రా కార్లకు ప్రత్యేకత ఉంది. మహీంద్రాలో స్కార్పియో-ఎన్‌కి భారతీయ మార్కెట్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆటోమోబైల్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసుకుంది. ఈ SUV గత సంవత్సరం నుంచి అందుబాటులో ఉంది. తాజాగా ఈ మోడల్ కారుకి జరిగిన ప్రమాద ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి.
రోడ్డు ప్రమాదంలో మాహీంద్రా స్కార్పియో-ఎల్ ట్రాక్టర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండుగా చీలిపోయిన చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. సంఘటన జరిగిన తర్వాత చిత్రీకరించిన వీడియో ఆధారంగా స్కార్పియో ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. అయితే ట్రాక్టర్ రెండుగా చీలీపోవడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని రెండు వరుసల రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వీడియోలో చూపిన ప్రకారం, మహీంద్రా స్కార్పియో-ఎన్‌లో ఇద్దరు ప్రయాణికులు రాత్రి సమయంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో దాదాపు 80-90 కి.మీ/గం వేగాంతో స్కార్పియో వచ్చి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. స్పీడ్ ని కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా ఒక ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ని ఢీకొట్టినట్లు విజువల్స్ ని చూస్తే అర్థమవుతుంది.
ఈ సమయంలో ట్రాక్టర్ కూడా అధిక వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. స్కార్పియో-ఎన్‌లో ఉన్నవారు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాక్టర్‌లో హెడ్‌ల్యాంప్‌లు ఆన్ చేయకపోవడంతో సరిగ్గా కనిపించలేదని తేరుకుని కంట్రోల్ చేసేలోపే ఘోరం జరిగినట్లు వారు వివరించారు. యాక్సిడెంట్ తీరును చూస్తే ప్రమాద తీవ్రతను సులభంగా అంచనా వేయవచ్చు. హై-స్పీడ్ ఈ ప్రమాదానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు.
ఈ ప్రమాదంలో మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫ్రంట్ భాగం పూర్తిగా దెబ్బతింది. దీనితో పాటు కారు అన్నీ వైపులా పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఈ ప్రమాదంలో కారు ఎయిర్‌బ్యాగ్‌లు సకాలలంలో తెరచుకోవడంతో స్కార్పియో-ఎన్‌లోని ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ దానిపై ఉన్నవారు గాయపడ్డారు.
ఇక మహీంద్రా స్కార్పియో-ఎన్ భద్రతా విషయానికి వస్తే పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 34 పాయింట్లకు 29.25 స్కోర్‌ను ఈ SUV సాధించింది. అలానే పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 48కి 28.94 స్కోర్‌ను పొందింది. గ్లోబల్ N-CAP ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించిన సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా ఇది బలమైన పనితీరును ప్రదర్శించింది.
ప్రమాదాల నుంచి కాపాడేలా గ్లోబల్ N-CAP ప్రకారం, సరికొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ 5 స్టార్ రేటింగ్ ని కలిగి ఉంది. మహీంద్రా నుంచి ఈ రేటింగ్ ని పొందిన మూడవ SUVగా ఇది నిలిచింది. స్కార్పియో-ఎన్ ఫుట్‌వెల్, బాడీ షెల్ స్థిరంగా ఉండనుంది. అలానే ఫుట్‌వెల్ ప్రాంతం అదనపు లోడింగ్‌లను తట్టుకునేలా రూపొందించింది.
ఇక దేశంలో రాంగ్ రూట్ లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. టైమ్ సేవ్ కోసం చాలా మంది రాంగ్ రూట్ ని వినియోగిస్తున్నారు. కానీ అది దీర్ఘకాలంలో మంచిది కాదని గమనించాలి. హైవేలపై రోడ్డు సూచికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అలానే అదే లేన్‌కు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. తప్పు లేన్ లేదా మరో దారిలో వెళ్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.
ప్రతి ఒక్కరూ రైట్-ఆఫ్-వే (సరైన దారి) అనే భావనను కలిగి క్రాసింగ్ వద్దకు వెళ్లేటప్పుడు వేగాన్ని తగ్గించి వెళ్లాలి. హైవేలపై ప్రయాణించేటప్పుడు, పట్టణాలు, గ్రామాల వంటి జనావాస ప్రాంతాల గుండా వెళుతున్నప్పుడు వేగాన్ని తగ్గించడం ఉత్తమ చర్య. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన క్రాసింగ్‌లు ఉన్నప్పటికీ, చాలా మంది ప్రజలు సమయాన్ని ఆదా చేయడానికి యాదృచ్ఛికంగా హైవేని దాటాలని ఎంచుకుంటారు అలాంటి వారి నుంచి ప్రమాదం జరిగే అవకాశం లేకపోదు. కావున జాగ్రత్తగా ఉండంటం మన లక్ష్యం.


Click it and Unblock the Notifications








