15 అడుగుల కిందకు పడ్డ మహీంద్రా కారు.. సురక్షితంగా బయటపడ్డ జనం (వీడియో)
భారతీయ మార్కెట్లో టాటా కార్ల తరువాత సేఫెస్ట్ కార్లు అనగానే గుర్తొచ్చేది మహీంద్రా అండ్ మహింద్ర కార్లు. ఇటీవల ఓ సంఘటనలో మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) 15 అడుగుల కింద పడిపోయింది. అయినప్పటికీ ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు.
నివేదికల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ నుంచి ప్రయాణిస్తున్న 7 మంది ప్రయాణికులతో వెళ్తున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ రోడ్డుపై నుంచి సుమారు 15 అడుగుల కిందకు పడిపోయింది. నిజానికి వీరంతా వారి బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తున్నట్లు సమాచారం. రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయం చేశారు.

కారు కిందకు పడిపోగానే ఆ మార్గం గుండా వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు వారిని రక్షించారు. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడగలిగారు. అయితే ఇందులో ఒకరికి ఎముక విరిగినట్లు సమాచారం. మిగిలినవారు దాదాపు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
నిజానికి 15 అడుగుల కిందికి కారు పడితే.. ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో అందరికి తెలుసు. కానీ ఇంత పెద్ద ప్రమాదంలో కూడా ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదు అంటే.. అది మహీంద్రా కంపెనీ యొక్క కారులోని నాణ్యత అనే చెప్పాలి. కారు బోల్తాపడినప్పటికీ పైకప్పు మరియు పిల్లర్స్ అన్నీ కూడా దృఢంగానే ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తోంది. ఈ విధమైన నాణ్యత వల్లనే ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు.

రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రమాదం జరగటానికి ప్రధాన కారణం ఖచ్చితంగా తెలియడం లేదు. బహుశా మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో ఏర్పడిన మెకానికల్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందా అని భావిస్తున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. దీనిపైన అధికారులు విచారణ జరుపుతున్నారు.
రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందులోనూ రాత్రి సమయంలో ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి అత్యవసరమైతే తప్పా.. రాత్రి సమయంలో ప్రయాణం చేయకపోవడమే అత్యుత్తమం. గతంలో కూడా వెలుగులోకి వచ్చిన చాలా సంఘటనలు కూడా రాత్రి సమయంలో ప్రయాణించడం వల్లనే అని తెలుస్తోంది. వీటిని నివారించడానికి ఉత్తమమైన మార్గం వీలైనంత వరకు రాత్రి సమయంలో ప్రయాణాన్ని నిలువరించుకోవడమే.
రోల్‌ఓవర్ అనేది భారతీయ రోడ్ల మీద సాధారణంగా జరిగే ప్రమాదం. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి డ్రైవర్ తప్పకుండా రోల్‌ఓవర్ గురించి తెలుసుకోవాలి. వాహనాన్ని డ్రైవ్ చేసేటప్పుడు తప్పకుండా దృష్టిని రోడ్డు మీద ఉంచాలి. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేవారు మరింత జాగ్రత్త వహించాలి. కారు ఎంత దృఢంగా ఉన్నప్పటికీ.. తీవ్రమైన ప్రమాదం జరిగితే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది.
డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డును గమనిస్తూనే ఉండాలి. మలుపుల్లో లేదా రోడ్డు వంపుల్లో డ్రైవర్ చాలా జాగ్రత్తగా కారును డ్రైవ్ చేయాలి. డ్రైవర్ జాగ్రత్తగా కారును డ్రైవ్ చేస్తేనే ప్రమాదాలను నిలువరించవచ్చు. డ్రైవింగ్ సమయంలో ఏ మాత్రం నిలక్ష్యం వహించినా.. ఆ ప్రమాదం ఊహాతీతమవుతుంది. కాబట్టి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే డ్రైవర్ జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా టైర్ ప్రెజర్ గురించి కూడా తేలేయూసుకోవాలి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








