Viral Dance in Mahindra Showroom కారు కొన్న ఆనందంలో షోరూంలోనే డాన్స్.. వైరల్ అవుతున్న 'వీర లెవల్ పర్ఫామెన్స్'

మన ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తుందంటే ఎంతో ఆనందంలో మునిగి తేలుతాం. మధ్యతరగతి కుటుంబాల్లో ఇది ఎంతో ప్రత్యేకం. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బైక్‌, ఇల్లు కట్టుకోవడం, బంగారం కొనుక్కోవడం ఇలా ఎంతో ఆనందాన్నిస్తాయి. అలాగే ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఓ సొంత కారు ఉండటం అనేది వారికి ఓ కల. ఆ కలను నిజం చేసుకున్న ఆనందంలో ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి చేసిన పని అందరినీ ఆకర్షించింది.

ఇండియాలోని లక్షలాది మధ్యతరగతి కుటుంబాలకు కారును సొంతం చేసుకోవడం చిరకాల స్వప్నం. ఎన్నో ఖర్చులను అధిగమించి ఆ కలను నిజం చేసుకున్నప్పుడు వచ్చే సంతోషమే వేరు. ఆ సందర్భంలో కేక్‌ కట్‌ చేసుకోవడం, ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి కుటుంబం మాత్రం తమ చిరకాల స్వప్నాన్ని సాధించుకున్న క్రమంలో పట్టలేని సంతోషంలో డాన్స్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral Dance in Mahindra Showroom

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దీనానాథ్‌ చాగు అనే వ్యక్తి కారు కొనాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తన పెళ్లి రోజు సందర్భంగా కారు కొనాలని నిర్ణయించకున్నారు. ఈ క్రమంలో మహీంద్రా స్కార్పియో-ఎన్‌ను కొనుగోలు చేసిన ఆ కుటుంబం చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. మహీంద్రా షోరూమ్‌ యజమాని మనీష్ రాజ్ సింఘానియా ట్విట్టర్‌లో ఆ విషయాన్ని పంచుకున్నారు.

రాలస్‌ మహీంద్రా అనే మహీంద్రా డీలర్‌షిప్ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతంలో వినియోగదారులకు సేవలందిస్తోంది. దీనానాథ్ చాగు అనే వ్యక్తి ఇటీవల ఇక్కడ మహీంద్రా స్కార్పియో-ఎన్‌ను డెలివరీ తీసుకున్నారు. తన 23 వ పెళ్లి రోజు సందర్భంగా ఆయన ఈ కారును కొనుగోలు చేశారు. కారును డెలివరీ తీసుకోవడానికి దీనానాథ్‌ చాగు కుటుంబం అక్కడికి వచ్చింది.

సాధారణంగా కార్ డెలివరీ ఈవెంట్స్ సమయంలో అక్కడ కేక్ కటింగ్ వంటి వేడుకలు జరుగుతాయి. కానీ దీనానాథ్ చాగు కుటుంబం మాత్రం తమ సంతోషాన్ని వేరే విధంగా పంచుకుంది. రాలస్‌ మహీంద్రా డీలర్‌ షిప్‌ తమ మహీంద్రా స్కార్పియో-ఎన్‌(Mahindra scorpio N)ని డెలివరీ చేసినప్పుడు దీనానాథ్‌ కుటుంబం డాన్స్ చేసి సంబరాలు చేసుకుంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారు కొన్న సంతోషంలో దీనానాథ్‌ కుటుంబం డాన్స్‌ చేయడంతో నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డీలర్‌షిప్ యజమాని మనీష్ రాజ్ సింఘానియా ఈ సందర్భాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. "గత 23 ఏళ్లలో నేను చూసిన అన్ని కార్ డెలివరీలలో నాకు ఇది ఎంతో ప్రత్యేకం. మేము మా వినియోగదారుల కలలను నిజం చేస్తూనే ఉంటాము.' అని అన్నారు.

దీనానాథ్‌ కుటుంబం తమ ఆనందాన్ని ఇలా డాన్స్‌ రూపంలో సెలబ్రేట్‌ చేసుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీని వెనుక మరో కారణం కూడా ఉంది. మహీంద్రా స్కార్పియో-ఎన్(Mahindra scorpio N) వినియోగదారులకు అందుబాటులో ఉండటం నిజంగా పెద్ద విషయం. ఎందుకంటే ఈ కారుకు దేశీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది.

ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో-ఎన్‌ దక్కించుకోవాలంటే చాలా కాలం వెయిట్‌ చేయాల్సిందే. ఈ కారు కొనుగోలు చేయాలనుకుంటే స్కార్పియోను బుక్‌ చేసుకున్న తేదీ నుంచి దాదాపు సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఎదురుచూడక తప్పదు. చాలా మంది ఈ కారు కోసం ఎదురు చూస్తుంటే, దీనానాథ్ కుటుంబం తాము కోరుకున్న వాహనం దక్కిందన్న ఆనందంలో కూడా డ్యాన్స్ చేసి ఆనందం వ్యక్తం చేసి ఉండొచ్చు.

భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో-ఎన్(Mahindra scorpio N) ప్రారంభ ధర రూ. 13.05 లక్షలుగా ఉంది. అదే సమయంలో, ఈ కారు టాప్ వేరియంట్ ధర రూ. 24.52 లక్షలు పలుకుతోంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ ధరలో మహీంద్రా స్కార్పియో-ఎన్ విలువ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే వినియోగదారుల నుంచి మహీంద్ర స్కార్పియో ఎన్‌కు విశేష స్పందన లభిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, May 19, 2023, 12:15 [IST]
English summary
Mahindra scorpio n owner dance in showroom after car bought visuals gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+