రాంగ్ రూట్‌లో వచ్చి కారు ఓనర్‌తో గొడవకు దిగిన బైకర్.. డ్యాష్ క్యామ్ లేకపోతే అంతే సంగతులు..

బైకర్లు పబ్లిక్ రోడ్లపై నిర్లక్ష్యంగా నడపడం మన దేశంలో కొత్తేమీ కాదు. నిర్లక్ష్యంగా రైడింగ్ చేయడం వల్ల తరచూ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొందరు బైకర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అవతలివారిపై తప్పు తోస్తుంటారు.

తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ప్రమాదానికి సంబంధించిన ఘటన.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన బైకర్, స్థానికుల తప్పును ఎత్తి చూపిస్తుంది. కారు డ్రైవర్ సరైన మార్గంలో వెళ్లినప్పటికీ వారిని బైకర్, స్థానికులు బోల్తా కొట్టేందుకు యత్నించారు. పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో చదవండి.

Mahindra-Scorpio-Accident

ఈ వీడియోను ప్రతీక్ సింగ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ ప్రమాదం తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి తన మహీంద్రా స్కార్పియో ఎన్‌లో తన కుటుంబంతో కలిసి తమిళనాడు సేలంలోని ఆలయానికి వెళ్తున్నారు.

వారు గ్రామీణ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నారు. రోడ్డు మార్గం వంకరగా ఉండటంతో పాటు ఇరుకుగా ఉంది. దీంతో స్కార్పియో డ్రైవర్ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నారు. అవతలి వైపు నుంచి వాహనాలు వస్తున్నాయో లేదో తెలియకపోవడంతో ప్రతి టర్నింగ్ లో హారన్ మోగిస్తున్నాడు.

Mahindra-Scorpio-Accident

రహదారి రద్దీగా లేకపోవడంతో డ్రైవర్ కూడా మంచి వేగంతోనే వెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఒక మలుపులో యథావిధిగా హారన్ నొక్కి టర్న్ తీసుకోవడానికి ముందుకు సాగాడు. మలుపు తిరగబోతుండగా ఎదురుగా రాంగ్ సైడ్ నుంచి వస్తున్న బైక్‌ను చూశాడు. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. స్కార్పియో ఎన్ డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయగా, బైకర్ బైక్‌ను కారు నుండి పక్కకు తిప్పాడు.

ఈ క్రమంలో అదుపు తప్పి బైక్ పై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. వారిద్దరూ స్థానికులు కావడంతో హెల్మెట్ ధరించలేదు. అదృష్టవశాత్తూ, వారు కారుని ఢీకొట్టకపోవడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. సాధారణంగా ప్రమాదం జరిగితే కొందరు కారు యజమానులు అలాగే కారును పోనిస్తారు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి ఆ పని చేయలేదు.

Mahindra-Scorpio-Accident

స్కార్పియో ఎన్ డ్రైవర్ ఆపి ఆ ఇద్దరు యువకులు క్షేమంగా ఉన్నారా అని పరిశీలించారు. దీంతో ఆ ఇద్దరూ లేచి నిలబడి ఎస్‌యూవీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ వీడియోలో ఉన్న ఎస్‌యూవీ తమిళనాడులో రిజిస్టర్ చేయబడింది. కారులో ఉన్నవారు స్థానికులు కాదని గుర్తించిన అక్కడి గ్రామ ప్రజలు వెంటనే పెద్దఎత్తున దందా ప్రారంభించారు.

ఇందులో తమ తప్పేమీ లేదని, బైక్‌ రాంగ్‌ సైడ్‌ నుంచి వస్తోందని కారులో ఉన్న వారు చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, యువకులు ఆగ్రహానికి గురై మరింత వాగ్వాదానికి దిగారు. వారు ఇంగ్లీషులో మాట్లాడటంతో ఇంగ్లీషులో మాట్లాడడం మానేసి తమిళంలో మాట్లాడాలని స్థానికులు కోరారు.

ఈ ప్రమాదానికి స్కార్పియో ఎన్ డ్రైవర్ కారణమని యువకులు ఆరోపించారు. అయితే ఇందులో తప్పు బైకర్ దే అని చూపించే వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని కారు యజమాని చెప్పాడు. దీంతో చాలాసేపు వాగ్వాదం తర్వాత స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

డాష్ క్యామ్ లో దాదాపు ప్రతిదీ రికార్డ్ అయిందని స్థానికులు గ్రహించడంతో వాగ్వాదం ముగిసింది. కారులో డ్యాష్‌క్యామ్‌ లేకుంటే స్థానికులు డబ్బులు ఇచ్చే వరకూ వదిలేవారు కాదు. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేశాడని ఆరోపించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్లలో డాష్ క్యామ్ ఎంత ముఖ్యమో ఈ వీడియో మరోసారి హైలైట్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 17, 2023, 19:36 [IST]
English summary
Mahindra scorpio n owner faces minor incident escapes with the help of dashcam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+