పొలం దున్నిన మహీంద్రా కారు - ట్రాక్టర్‌కు ఏ మాత్రం తగ్గేదేలే (వీడియో)
సాధారణంగా వ్యవసాయం చేసేటప్పుడు భూమిని దున్నాలంటే ఎత్తులను లేదా ట్రాక్టర్ ఉపయోగిస్తారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో మహీంద్రా స్కార్పియో ఎన్ భూమిని దున్నుతుండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఒకటైన ఇండియా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడ సుమారు 55 శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే.. ఇప్పుడు వ్యవసాయంలో టెక్నాలజీలను ఉపయోగించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయానికి ట్రాక్టర్ల వంటి ఆధునిక యంత్రాలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో భూమిని దున్నటానికి ట్రాకర్ బదులు మహీంద్రా స్కార్పియో ఉపయోగించడం చూడవచ్చు. ఈ వీడియో రాహుల్ రావ్ సాహెబ్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో తెల్లటి మహీంద్రా స్కార్పియో చేసే పనిని చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో మరో ఆశ్చర్యకరమైన మరియు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. కారులో ఎవరూ లేరు. అంటే కారును ఎవరూ డ్రైవ్ చేయడం లేదు. కారు తనకుతానుగా మెల్లగా ముందుకు కదులుతోంది. కారు వెనుక భాగంలో నాగలి లాంటి ఓ పరికరాన్ని కట్టి ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రెండో వీడియోలో ట్రాక్టర్ ఒకవైపు, మహీంద్రా స్కార్పియో-ఎన్ మరో వైపు ఉంది. వీటి మధ్య టగ్ ఆఫ్ వార్ మూడు రౌండ్లలో జరిగింది. మొదటిసారి ట్రాక్టర్, మహీంద్రా స్కార్పియో ఒకదాన్ని మించి ఒకటి నేలగా రెండూ అద్భుతమైన ప్రతిభ కనపరిచాయి. ఇందులో ఏ వాహనం ముందుకు వెళ్ళలేదు. వాటి బలాలు సమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండోసారి నిర్వహించిన టగ్ ఆఫ్ వార్‌లో ట్రాక్టర్, మహీంద్రా కారును కొంత లాగింది.
ఇక చివరి రౌండ్ లేదా మూడు రౌండ్ సిమెంట్ రోడ్డు మీద నిర్వహించారు. ఇందులో ట్రాక్టర్‌ను, మహీంద్రా స్కార్పియో-ఎన్ లాగేసింది. మొత్తం మీద అటు పొలాన్ని దున్నటమే కాదు టగ్ ఆఫ్ వార్‌లో కూడా మహీంద్రా స్కార్పియో మంచి ప్రతిభ కనపరిచింది. ఈ రెండు వీడియోలు చూపరులను చాలా ఆకట్టుకుంటున్నాయి. బహుశా ఇలా మహీంద్రా స్కార్పియోతో టగ్ ఆఫ్ వార్ నిర్వహించడం బహుశా ఇదే మొదటిసారి అనిపిస్తుంది.
మహీంద్రా స్కార్పియో-ఎన్
మహీంద్రా కంపెనీ యొక్క స్కార్పియో-ఎన్ విషయానికి వస్తే.. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయి. ఈ కారణంగానే ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








