భారీ ప్రమాదం.. అయినా బతికి బట్టకట్టారు.. యాక్సిడెంట్ల నుంచి కాపాడే 5 స్టార్ రేటింగ్ కారు..!
భారతీయ రోడ్లపై ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ప్రమాదాలను చూస్తున్నాం. అలానే బీహార్‌లో ఓ బైకర్ వల్ల బ్రాండ్-న్యూ మహీంద్రా స్కార్పియో తీవ్ర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద సమయంలో స్కార్పియో-ఎన్‌లో ప్రయాణిస్తున్న వారంతా సురక్షింతంగా బయటపడ్డారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అసలేం జరిగిందంటే..
బీహార్ కి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే తన సిబ్బందితో కలిసి బీహార్‌లోని సీతామర్హి వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవే-77లో ఈ ప్రమాదం జరిగింది. తాము ప్రయాణిస్తున్న కారుకు ఓ బైక్ ఆకస్మాత్తుగా ఎదురు వచ్చింది. దీంతో బైకర్‌ను రక్షించేందుకు డ్రైవర్ పక్కకు వాహనాన్ని తీసుకెళ్లాడు. భారీ వేగంలో ఉన్న ఈ SUV అధిక వేగంతో రైలు ట్రాక్ ప్రహారీని ఢీకొట్టింది.

అంతా సేఫ్..
ఈ ప్రమాదంలో బైక్ రైడర్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అక్కడి నుంచి తాను తప్పించుకున్నాడు. అయితే స్కార్పియో-ఎన్ వాహనంలో ఉన్న వారందరూ అదృష్ణశావత్తు తమ ప్రాణాల్నీ నిలబెట్టుకోగలిగారు. వాహనానికి జరిగిన నష్టాన్ని చూపించే మరిన్నీ స్కార్పియో-N చిత్రాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని అందుబాటలో ఉన్న పిక్స్ ద్వారా ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చు.
అయితే కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీలు ప్రారంభించినప్పటి నుంచి అనేక ప్రమాదాలు జరిగాయి. SUV మరొక ప్రమాదంలో కారు అధిక వేగంతో వంతెనపై ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టడాన్ని చూపిస్తుంది. రైలింగ్ వాహనం క్యాబిన్‌లోకి చొరబడకుండా కారు ఆగిపోయింది. దీంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేవు.
5 స్టార్ రేటింగ్..
గ్లోబల్ NCAP నిర్వహించిన తాజా రౌండ్ క్రాష్ పరీక్షల ప్రకారం, సరికొత్త మహీంద్రా స్కార్పియో-N 5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ SUV కొత్త టెస్టింగ్ ప్రోటోకాల్‌ను పొందింది. పెద్దల భద్రత కోసం ఖచ్చితమైన ఫైవ్-స్టార్ స్కోర్, పిల్లల భద్రత కోసం 3-స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ విజయంతో, మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆ కంపెనీ నుంచి ప్రతిష్టాత్మకమైన ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన నుంచి మూడవ SUVగా నిలిచింది.
గ్లోబల్ N-CAP మూల్యాంకనం ప్రకారం, మహీంద్రా స్కార్పియో-N డ్రైవర్, ప్రయాణీకులకు తగిన రక్షణను అందిస్తుంది. ఈ SUV కఠినమైన సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో అనూహ్యంగా పనిచేసి తన సత్తాను చాటింది. మొత్తం 17 పాయింట్లలో ఈ 16 స్కోర్ ను ఈ కారు సాధిచింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో, స్కార్పియో-N OK రేటింగ్‌ను పొందింది. అయితే ప్రమాద సమయంలో ప్రయాణికుల ఛాతీ కొంచం బలహీనంగా ఉన్నట్లు వెల్లడైంది.
కఠిన పరీక్షల్లో అద్భుత పనితీరు..
గ్లోబల్ N-CAP కూడా కొత్త మహీంద్రా స్కార్పియో-N యొక్క బాడీ షెల్ ఫుట్‌వెల్ స్థిరంగా ఉన్నాయని.. ఫుట్‌వెల్ ప్రాంతం అదనపు లోడ్‌లను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని నివేదించింది. గ్లోబల్ N-CAP కార్లను అంచనా వేయడానికి 64 km/h వేగంతో సింగిల్ ఫ్రంట్ క్రాష్ పరీక్షలను నిర్వహిస్తోంది. అయినప్పటికీ ఇందులో కొన్ని పరీక్ష నిబంధనలు నవీకరించబడ్డాయి. ఇవి చాలా కఠినంగా ఉంటాయి.
కొత్తగా సైడ్ క్రాష్ ప్రభావాలు ఇప్పుడు చేర్చబడ్డాయి. అంతేకాకుండా, క్రాష్ టెస్ట్ డమ్మీలపై ఛాతీ లోడ్ రీడింగ్‌లను లెక్కించేందుకు గ్లోబల్ N-CAP కఠినమైన కొలతలను అవలంబించడంతో ఫ్రంట్ టెస్ట్ ప్రమాణాలు మరింత కఠినంగా మారాయి. కొత్త నిబంధనల ప్రకారం, సైడ్ ఇంపాక్ట్ పరీక్షలు తప్పనిసరి.
ఇప్పుడు చైల్డ్ డమ్మీలను కూడా అందులో చేర్చింది. తాజా క్రాష్ టెస్ట్ పోల్-సైడ్ ఇంపాక్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇంకా, అన్ని కొత్త మోడళ్లకు పాదచారుల రక్షణ తప్పనిసరి. తయారీదారులు తప్పనిసరిగా UN127 లేదా GTR9 పరీక్షల కోసం ధ్రువీకరణను పొందాలి. అన్ని పరీక్షల్లో ఈ కారు ధృడంగా ఉంది. కావున వినియోగదారులకు ఈ కారు బాగా నచ్చింది.


Click it and Unblock the Notifications








