హ్యాండ్‌బ్రేక్‌ను వినియోగించకుంటే ఇంత ప్రమాదమా.. ఏకంగా నదిలోకి వెళ్లిపోయిన మహీంద్రా SUV..!

కార్లను శుభ్రం చేసేందుకు పట్టణాలు, నగరాల్లో కార్‌ వాష్‌ సెంటర్‌లపై ఆధారపడతారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది వినియోగదారులు సమీపంలోని చెరువులు లేదా నదుల వద్దకు తీసుకెళ్లి శుభ్రం చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చింది.

నదీతీర ప్రాంతంలో శుభ్రం చేస్తున్న సందర్భంలో మహీంద్రా స్కార్పియో N SUV (Mahindra scorpio N SUV) నదిలోకి వెళ్లిపోయింది. కారును నది ఒడ్డున పార్కింగ్‌ చేసి హ్యాండ్‌ బ్రేక్‌ను వినియోగించడం మర్చిపోయాడు. దీంతో వాలుగా ఉన్న రోడ్డుపై నుంచి నదిలోకి కారు వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Mahindra scorpio N SUV price and specifications

హ్యాండ్‌ బ్రేక్‌ ఎంగేజ్‌ చేయకపోవడం : ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బైకుంతపూర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. మహీంద్రా స్కార్పియో N వాహనాన్ని శుభ్రం చేసేందుకు డ్రైవర్‌ నది ఒడ్డుకు తీసుకువచ్చాడు. వాహనం నిలిపాక హ్యాండ్‌ బ్రేక్‌పైన సరిగా దృష్టిసారించలేదు. దీంతో అక్కడ దారి వాలుగా ఉన్న కారణంగా మహీంద్రా SUV క్రమంగా నదీలోకి వెళ్లిపోయింది.

అనంతరం నదీలో పూర్తిగా మునిగిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో డ్రైవర్‌ అప్రమత్తం అయ్యాడు. వెంటనే పెద్ద క్రేన్‌ సాయంతో కారును బయటకు తీయించాడు. ఈ సందర్భంలో కారు ముందు బంపర్‌ దెబ్బతింది. అయితే తొలుత వాహనాన్ని క్రమంగా బయటకు తీసుకొచ్చి, అనంతరం క్రేన్‌ సాయంతో లిఫ్ట్‌ చేశారు.

mahindra car rolls into river in Chhattisgarh

గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయి. రోడ్లు వాలుగా ఉన్న ఇటువంటి ప్రాంతాల్లో పార్కింగ్ చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. హ్యాండ్‌బ్రేక్‌ పనితీరు తనిఖీ చేసి, బ్రేక్‌ను ఎంగేజ్‌ చేయాలి. అయితే ప్రమాదం స్వభావాన్ని బట్టి మహీంద్రా స్కార్పియో N ఎస్‌యూవీ మాన్యువల్‌ గేర్‌బాక్స్ వెర్షన్‌కు చెందినదిగా తెలుస్తోంది.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ఇలాంటి సమయాల్లో చాలా మంది వాహనాల్లోకి ప్రవేశించి బ్రేకులు వేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకర ప్రయత్నం. అందుకు బదులుగా ముందే అప్రమత్తంగా వ్యవహరించి హ్యాండ్ బ్రేక్‌ను ఎంగేజ్‌ చేయడం ఉత్తమం.

use of hand brake in cars

మహీంద్రా స్కార్పియో N ప్రారంభ ధర రూ.16.58 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌ రూ.30.77 లక్షలుగా ఉంటుంది. పెట్రోల్‌, డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. మరియు మాన్యువల్‌, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 6,7 సీటర్‌ వెర్షన్‌లలో లభిస్తుంది. ఎల్‌డీఈ ప్రాజెక్టర్‌ ల్యాంప్‌, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, ముందు, వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 27, 2023, 13:02 [IST]
English summary
Mahindra scorpio n suv rolls into river video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+