విచిత్రంగా బోల్తా పడిన మహీంద్రా స్కార్పియో.. ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డ ప్రయాణికులు, అసలేం జరిగిందంటే.!!

దేశంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతుండగా.. ఒక్కోసారి ఎవరి ప్రమేయం లేకుండానే ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

జమ్మూలో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో వైరల్‌గా మారింది. మహీంద్రా స్కార్పియో-ఎన్‌(Mahindra Scorpio-N) రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు స్కిడ్‌ (జారిపోవడంతో) ఓ ఇంట్లో పడిపోయింది. అయితే ఇందులో ఇద్దరు ప్రయాణికులు ఉండగా వారికి ఎలాంటి గాయాలు కాలేదు.

Mahindra-Scorpio-N-Road-Accidentv

జమ్మూలో ఓ ప్రాంతంలోని నివాసాల మధ్య ఓ ఇరుకైన రోడ్డుపై మహీంద్రా స్కార్పియో-ఎన్ వెళ్తోంది. ఈ క్రమంలో కారు చక్రం ఒకటి రోడ్డు పక్కకి ఇరుక్కుపోయింది. ఇలాంటి సందర్భాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చాలా మంది డ్రైవర్లు కారు వేగాన్ని పెంచుతారు. ఇక్కడ డ్రైవర్‌ కూడా అదే పని చేశాడు. కానీ ఇక్కడ చక్రం ట్రాక్షన్‌ కోల్పోయి కారు స్కిడ్‌ అయింది.

దీంతో రోడ్డు అంచు మీదుగా కారు 20 అడుగులు దూసుకుపోయి ఓ ఇంట్లోకి వెళ్లి బోల్తా పడింది. వీడియోలో చిత్రాలను పరిశీలించినట్లయితే.. వాహనం పై కప్పు పూర్తిగా దెబ్బ తిన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యాక్సిడెంట్లో A పిల్లర్లు సమర్థవంతంగా పనిచేయడంతో బరువును మోయగలిగాయి.

Mahindra-Scorpio-N-Road-Accident

ఘటనలో కారులో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు సీటు బెల్టు ధరించడంతో వారికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. కాగా కారు అనేక సార్లు బోల్తా పడి ఆ ఇంట్లో రివర్స్‌లో పడిపోయినట్లుగా సమాచారం. స్కార్పియో-ఎన్‌లో కూర్చున్న వారు చనిపోయి ఉండొచ్చని భావించినట్లు కారు యజమాని తెలిపారు. కానీ అందరూ సురక్షితంగా ఉండటంతో హర్షం వ్యక్తం చేశారు.

ఇక మహీంద్రా స్కార్పియో-ఎన్ విషయానికొస్తే ఈ SUV ని భద్రతా పరంగా చాలా స్ట్రాంగ్‌గా నిర్మించారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి విభిన్న ఫీచర్లను ఇందులో పొందుపరించారు. ఈ SUV రియర్‌ వీల్‌ డ్రైవ్ (RWD) వాహనం కాబట్టి.. ఇది కంకర రోడ్లపై సైతం కంట్రోల్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఘటనలో స్కార్పియో-ఎన్‌ దృఢమైన బిల్ట్‌ క్వాలిటీ కారణంగా కారు పెద్దగా డ్యామేజ్‌ కాకపోగా.. ప్రయాణికులకు కూడా గాయాలు కాలేదు. ఇది వారికి గట్టి సేఫ్టీని అందించింది. గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు 5 స్టార్‌ రేటింగ్‌ను సాధించింది. అడల్ట్‌ విభాగంలో 34 కి 29.25 స్కోర్‌ను సాధించింది.

చైల్డ్‌ ప్రొటెక్షన్‌ విభాగంలో 48 కి. 28.94 స్కోర్‌ను పొందింది. ఇక సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్ట్‌లోనూ స్కార్పియో-N అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఇక డ్రైవర్‌ మెడకు కూడా మంచి రక్షణనిస్తుందని ఈ కారు నిరూపించింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో, స్కార్పియో-N 17కి 16 పాయింట్లను సాధించింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, November 16, 2023, 12:15 [IST]
English summary
Mahindra scorpio n suv slips and falls into a house passengers were safe
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+