ఆర్టీసీ బస్సును తలపించిన మహీంద్రా స్కార్పియో.. ఏకంగా 18 మందితో కిక్కిరిసిపోయిన ఎస్‌యూవీ.!

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ ఒకటి. స్కార్పియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడటానికి కారణాలు ఉన్నాయి. అధిక మైలేజ్‌ ఇవ్వడమే కాకుండా.. పనితీరు పరంగా కూడా మెరుగ్గా ఉంటుంది. ఇందులో అధికంగా 9 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఇప్పుడు.. రెట్టింపు సంఖ్యలో ప్రయాణించిన సంఘటన చోటుచేసుకుంది.

మార్కెట్లో మహీంద్రా స్కార్పియో(18 Travelled In Mahindra Scorpio) ప్రస్తుతం 6 సీటర్, 7 సీటర్ మరియు 9 సీటర్ అనే 3 ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది గరిష్ఠంగా కేవలం 9 మందిని మాత్రమే తీసుకెళ్లగలదు. అయితే మహీంద్రా స్కార్పియో కారులో మొత్తం 18 మంది ప్రయాణించారంటే మీరు నమ్ముతారా.?

Mahindra-Scorpio-SUV-18-Carrying

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో, మొత్తం 18 మంది మహీంద్రా స్కార్పియో(Mahindra Scorpio SUV) కారు నుంచి ఒకరి తర్వాత ఒకరు దిగడాన్ని చూడవచ్చు. ఈ కారులో పురుషులు, మహిళలు, బాలురు, బాలికలు సహా మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నారు.

అయితే ఇదే మొదటిసారని కాదని మనం గమనించాలి. ఇంతకంటే దారుణమైన ఘటనలు గతంలో చూశాం. విచిత్రం ఏమిటంటే ఒక్క ఆటో రిక్షాలో మొత్తం 27 మంది ప్రయాణించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రయాణాలు భవిష్యత్తులో చాలా డేంజర్‌ అని గమనించాలి. లేదంటే ఘోర ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాహనాల్లో ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలకు దూరంగా ఉండటం చాలా అవసరం.

Mahindra-Scorpio-SUV-18-Carrying

ఇక మహీంద్రా స్కార్పియో విషయానికొస్తే.. భారతదేశంలో SUV మార్కెట్‌ విపరీతంగా ఉంది. ముఖ్యంగా టాటా మోటార్స్ మరియు మహీంద్రా ఎస్‌యూవీలకు మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో సెడాన్‌ల కంటే SUV లే ఎక్కువగా అమ్ముడవతున్నాయి. ఇక కొన్ని కంపెనీలు ప్రారంభంలో లాంచ్‌ చేసిన SUVల ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను విడుదల చేసి అప్‌డేట్‌ చేస్తున్నాయి.

మార్కెట్లో ముఖ్యంగా మహీంద్రా స్కార్పియో గత రెండు దశాబ్దాలుగా తన ఉనికిని కొనసాగిస్తూ కస్టమర్ల ఆదరణ పొందుతోంది. ప్రతి నెలా అమ్మకాల పరంగా మహీంద్రా సేల్స్‌లో అధిక వాటాను కలిగి ఉంది. ఈ SUV యొక్క క్రేజ్‌కి దాని అసాధారణమైన సామర్థ్యం, శక్తి, పనితీరు మరియు దాని కఠినమైన రూపమే కారణం.

Mahindra-Scorpio-SUV-18-Carrying

ఇప్పటికే అదే డిజైన్‌తో గత రెండు దశాబ్దాల్లో, కొన్ని ఇంటీరియర్ మరియు కొన్ని డిజైన్ మార్పులు చేయబడ్డాయి. కానీ దాని ఐకానిక్ లుక్ మాత్రమే ఇప్పటికీ ఇలాగే ఉంది. దీంతో ఇంతటి భారీ, అద్భుతమైన కారులో ఒకేసారి 18 మంది ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 5, 2024, 18:53 [IST]
English summary
Mahindra scorpio suv carrying 18 people video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+