Live Video మీరు ఇలానే ఓవర్‌టేక్‌ చేస్తున్నారా... మహీంద్రా స్కార్పియో బోల్తా ఘటన వీడియో ఒక్కసారి చూడండి..!

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వేలల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయిదే అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అతివేగం, ర్యాష్‌ డ్రైవింగ్‌ వంటి కారణాలు ‌ప్రధానమైనవి. ఈ ఘటనల్లో గాయాలతో కొందరు బయటపడుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

అయితే తాజాగా మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) ప్రమాదానికి గురైంది. వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వెనుక వస్తున్న వాహనం డ్యాష్‌క్యామ్‌లో రికార్డు అయింది. ఈ వీడియోను ఏవీ క్రియేషన్స్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

mahindra scorpio suv lost control

లైవ్‌ వీడియో : కేరళలోని ఓ ప్రాంతంలో మహీంద్రా స్కార్పియో వాహనం ప్రయాణిస్తోంది. కొంత దూరం ప్రయాణం చేశాక.. ముందున్న హాండా అమేజ్‌ సెడాన్‌ వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసేందుకు మహీంద్రా డ్రైవర్‌ ప్రయత్నం చేశాడు. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ వీడియో అంతా వెనుక వస్తున్న బస్సు డ్యా్ష్‌క్యామ్‌లో రికార్డు అయింది.

మహీంద్రా స్కార్పియో డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చిన్న రోడ్డుపై ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నం చేశాడు. రోడ్డును సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో వాహనం అదుపుతప్పింది. ఫలితంగా బోల్తా పడింది. అనంతరం మహీంద్రా SUV డోర్లు రోడ్డును తాకుతూ ముందుకు వెళ్లాయి. దీంతో అక్కడ చిన్న స్పార్క్‌ రావడం గమనించవచ్చు. అక్కడున్న స్థానికులు వెంటనే మహీంద్రా స్కార్పియో వాహనం దగ్గరికి వెళ్లారు. అందులోని ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు.

mahindra scorpio goes wrong while trying to overtake

ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మహీంద్రా స్కార్పియో డ్రైవర్‌ మాత్రమే. సరైన అవగాహన, అంచనా లేకుండా ముందున్న వాహనాలను ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నం చేశారు. మహీంద్రా స్కార్పియో SUV వాహనం పొడవుగా ఉంటుంది. ఫలితంగా ఎక్కువ గురుత్వాకర్షణను కలిగి ఉంటుంది. ఫలితంగా రోడ్డు మలుపులు వద్ద కాస్త అప్రమత్తంగా డ్రైవింగ్‌ చేయాల్సి ఉంటుంది. డ్రైవర్‌ కాస్త అవగాహనతో ప్రవర్తించి ఉంటే ప్రమాదం తప్పేది.

mahindra scorpio kerala accident

రోడ్డుకు అనుగుణంగానే డ్రైవింగ్‌ చేయాలి : అయితే మహీంద్రా వాహనం బోల్తా పడిన సమయంలో సమీపంలో మరో వాహనం లేదు. అందువల్ల ఇతర వాహనాలను ఢీకొనలేదు. మరియు బోల్తా పడిన అనంతరం కూడా ఒకటే లేన్‌లో ఉంది. ఫలితంగా ఇతర వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందువల్ల రోడ్డుకు అనుగుణంగా వాహనాలను డ్రైవింగ్‌ చేయాల్సి ఉంటుంది. మరియు అధిక వేగం ఎప్పుడు ప్రమాదకరం అని గుర్తు పెట్టుకోవాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, January 5, 2024, 11:59 [IST]
English summary
Mahindra scorpio suv topless overtake goes wrong dashcam video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+