వామ్మో!.. ఎంత పెద్ద ప్రమాదం.. వీడియో చూస్తే తప్పక భయపడతారు
ప్రపంచంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇండియాలో ప్రతి ఏటా కొన్ని వేలమంది రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రమాదానికి కారణాలు కోకొల్లలు, ఇందులో ఒకటి మితిమీరిన వేగం కూడా. అతి వేగం ప్రమాదం మాత్రమే కాదు, ప్రాణాంతకం కూడా. వేగంగా వెళ్ళేటప్పుడు ప్రమాదం జరిగితే.. ఆ ప్రమాదం తీవ్రత ఏవిధంగా ఉంటుందో దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. ఇలాంటి ఘటన మరొకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మహీంద్రా థార్ SUV కనిపిస్తుంది. ఈ కారు యొక్క ముందు భాగంలో చొచ్చుకుని.. వెనుక భాగంలో బయటకు వచ్చిన రోడ్డు పక్కన సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన మెటల్ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేదానికి ఖచ్చితమైన అధరాలు లేవు, కానీ థార్ రిజిస్ట్రేషన్ రాజస్థాన్‌లో చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం ఎలా జరిగింది.. అంత పెద్ద మెటల్ ముందువైపు నుంచి వెనుకవైపు వెళ్లిందంటే ఆ కారు ఎంత వేగంగా వెళ్ళింది? అనే వివరాలు అందుబాటులో లేదు. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ.. ఇందులో ఎవరికీ పెద్ద గాయాలు అయినట్లు కూడా వెల్లడి కాలేదు. బహుశా ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్క డ్రైవర్ మాత్రమే ఉండి, ఉంటారని భావిస్తున్నాము.
డ్రైవర్ తప్పా.. ఇతరులు కారులో లేకపోవడం నిజమైతే ఎవరికీ ఏ హాని జరిగి ఉండదని తెలుస్తోంది. ఎంతుకంటే రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన మెటల్ ముందు భాగంలో ఉన్న చక్రం దగ్గర ప్రారంభమై.. వెనక్కు వెళ్ళింది. కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి పెద్దగా ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది. మెటల్ కారు బాడీ గుండా చొచ్చుకు పోయింది. కాబట్టి ఇది అతి వేగం వల్ల జరిగిన ప్రమాదమే అని తెలుస్తోంది.

థార్ డ్రైవర్ మితిమీరిన వేగంతో వచ్చాడా? లేకపోతే.. కంట్రోల్ తప్పిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్డి ఉంది. మెటల్ ముందు నుంచి వెనుకకు వెళ్ళింది. ఇది తప్పా మిగిలిన మొత్తం భాగం కూడా ఎలాంటి గీతలు లేదా నొక్కులు వంటివి కూడా పడలేదు. ఈ ఘటన చూడటానికి ఎలా ఉందంటే.. ఓ పండులోకి కత్తిని దింపినట్లు ఉంది. మొత్తానికి ఈ వీడియో చూపరులను తప్పకుండా భయపెడుతుంది.
నిజానికి భారతదేశంలో ఇలాంటి ప్రమాదాలు జరగటం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది బీఎండబ్ల్యూ 3 సిరీస్ అధిక వేగంతో గార్డ్‌రైల్‌లోకి వెళ్ళింది. ఆ సమయంలో బీఎండబ్ల్యూ కారు 150 కిమీ / గం వేగంతో వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గుజరాత్ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బీఎండబ్ల్యూ కారు రెండుగా విభజించబడింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో కూడా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.
కొత్త కార్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది డ్రైవర్లు ట్రిపుల్ వేగంతో ప్రయాణిస్తున్నారు. మితిమీరిన వేగంతో వెళ్ళినప్పుడు వాహనాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఆ సమయంలో అదుపుతప్పి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైవర్లు కారును డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








