బ్రేక్‌కి బదులు యాక్సిలేటర్ తొక్కితే ఇలాగే జరుగుతుంది.. రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన థార్ (వీడియో)
ఈ మధ్య చాలా మంది యువత కారు డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త అయోమయానికి లోనవుతున్నారు. చిన్నపాటి పొరపాట్లతో క్షణాల్లో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు రెట్టింపు అవుతున్నాయి. ముఖ్యంగా షోరూమ్‌ల నుంచి కొత్త వాహనాలను బయటకు తీసే క్రమంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువ డ్రైవర్ కారుని నియంత్రించలేక పోయాడు. ఆ ప్రమాదానికి సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకున్న వారు తరచూ బ్రేక్, క్లచ్, యాక్సిలేటర్ పెడల్స్‌కి మధ్య కొద్దిగా అయోమయానికి గురవుతున్నారు. తాజాగా వైరల్ అయిన వీడియోలో మహీంద్రా థార్ డ్రైవర్ బ్రేక్ పెడల్‌కి బదులు యాక్సిలేటర్‌ని తొక్కడంతో ప్రమాదం జరిగింది.
ఈ వీడియోను నిఖిల్ రానా అనే యూట్యూబర్ తన ఛానల్‌లో షేర్ చేశాడు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలోని ఓ రెస్టారెంట్ బయట జరిగింది. అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో యాక్సిడెంట్ విజువల్స్ రికార్డయ్యాయి. ఈ వీడియోలో మహీంద్రా థార్ డ్రైవర్‌కి అక్కడే ఉన్న గార్డ్ చేతులు ఊపుతూ డైరెక్షన్స్ ఇవ్వడం మనం చూడవచ్చు. అంతలోనే ఊహించిన సంఘటనతో ఒక్కసారిగా అక్కడి వారు ఆశ్చర్యపోయారు.

వాహనాన్ని పార్క్ చేయాలని డ్రైవర్‌కి సూచిస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. థార్ డ్రైవర్ బహుశా కొత్త డ్రైవర్ లేదా అనుభవం లేని డ్రైవర్ కావచ్చని వీడియో ప్రకారం తెలుస్తోంది. సెక్యూరిటీ గార్డు సిగ్నల్స్‌తో బ్రేకులకు బదులు యాక్సిలరేటర్‌పై కాలు పెట్టినట్లు అర్థం అవుతుంది. ఆ వెంటనే నియంత్రణ కోల్పోయిన థార్ మెట్లు ఎక్కి రెస్టారెంట్ ముందున్న గ్లాస్ డోర్‌ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
యాక్సిలేటర్ ఎక్కువగా తొక్కడంతో థార్ వెనుక చక్రం వేగంగా తిరగడాన్ని చూడవచ్చు. ఆ తర్వాత వెనక్కి వెళ్లే క్రమంలోనూ పక్కనే ఆగి ఉన్న మారుతి రిట్జ్ కారును వెనక నుంచి ఢీకొట్టింది. వెంటనే అక్కడి వారు గార్డును, డ్రైవర్‌ని రక్షిచేందుకు రెస్టారెంట్ నుంచి బయటకు పరుగులు తీయడం వీడియోలో చూడవచ్చు. అయితే ఆటోమేటిక్ వేరియంట్ అని తెలుస్తుంది. దీనిపై అవగాహన లేక ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

ఒక కాలు బ్రేకుపై మరియు మరొకటి యాక్సిలరేటర్‌పై ఉండాలి. ఇది కొద్దిగా గందరగోళాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆటోమేటిక్ కారును నడుపుతున్నప్పుడు ఎప్పుడూ ఒక కాలుతో నడపండి. అలా చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. దీనికి కారణం డ్రైవర్‌కి సరైన అవగాహణ లోపం అన స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే కొత్తగా డ్రైవింగ్ చేసేవారు పక్కన అనుభవం ఉన్న వారిని తోడుగా తీసుకువెళ్లాలి.
ఇక థార్ విషయానికి వస్తే ఇది రెండు ఇంజిన్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. మహీంద్రా థార్ భారత మార్కెట్లో మారుతి సుజుకి జిమ్నీ మరియు ఫోర్స్ గూర్ఖా వంటి వాటికి పోటీ ఇస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఆఫ్-రోడర్ వెయిటింగ్ పీరియడ్ ఒక సంవత్సరంగా ఉంది.
ఈ ఏడాది థార్ 5 డోర్ థార్‌ని కూడా లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. థార్ 5 డోర్ కొత్త గ్రిల్, బంపర్ డిజైన్ మరియు ఇంటిగ్రేటెడ్ ఫాగ్ ల్యాంప్స్‌ని కలిగి వస్తుంది. థార్ ఫైవ్ డోర్ యొక్క వీల్ బేస్ స్కార్పియోను పోలి ఉంటుంది. థార్ 5 డోర్‌లో వచ్చే సస్పెన్షన్ సెటప్ స్కార్పియో Nలో ఉండే సస్పెన్షన్ సెటప్‌ని పోలి ఉండనుంది. థార్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ రానుంది.


Click it and Unblock the Notifications








