పబ్లిక్ రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్.. వీడియో చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది!

పబ్లిక్ రోడ్ల మీద పోకిరీలు ర్యాష్ డ్రైవింగ్ చేసిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటి మరో సంఘటన తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో మహీంద్రా కంపెనీకి చెందిన పాపులర్ ఆఫ్ రోడర్ 'థార్' యొక్క ర్యాష్ డ్రైవింగ్ చూడవచ్చు. థార్ కారును డ్రైవ్ చేసే వ్యక్తి పబ్లిక్ రోడ్డు మీద తనకు ఇష్టమొచ్చినట్లు కారును డ్రైవ్ చేయడం చూడవచ్చు. ఇందులో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కారును ఫుట్ పాత్ మీద డ్రైవ్ చేయడం చూడవచ్చు.

Mahindra-Thar-Reckless-Driving

మహీంద్రా థార్ డ్రైవ్ చేసే సమయంలో ఆ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న పార్కింగ్ చేసిన బైకులను ఢీ కొట్టడం కూడా చూడవచ్చు. అయితే ఆ సమయంలో బైకుల మీద ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంతటితో ఆగకుండా.. రోడ్డుపైన కూడా వాహనాలకు అడ్డుగా వెళ్లడం, మళ్ళీ మళ్ళీ ఫుట్ పాత్ మీదకు వెళ్లడం.. కిందికి దిగటం వంటివి చేయడం చూడవచ్చు.

ఈ వీడియో ప్రస్తుతం థర్డ్ఐ అనే ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు. డ్రైవర్ థార్ యొక్క ఆఫ్ రోడింగ్ కెపాసిటీని టెస్ట్ చేయడానికి ఇలా చేస్తున్నాడా? లేదా.. కావాలనే ఇలా చేస్తున్నాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పబ్లిక్ రోడ్డు మీద ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే.. ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు కారును ఆపకుండా వెళ్ళిపో అన్నట్లు సైగ చేయడం కనిపిస్తుంది.

Mahindra-Thar-Reckless-Driving

మహీంద్రా థార్ కారును ఇక్కడ గమనించినట్లయితే.. దీనికి ముందుగానీ, వెనుకగానీ నెంబర్ ప్లేట్ లేదు. అంతే కాకుండా ఈ కారులో సన్‌ఫిల్మ్‌ వంటివి కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. నిజానికి సన్‌ఫిల్మ్‌ వినియోగం చట్ట విరుద్ధం. గతంలో సన్‌ఫిల్మ్‌ ఉపయోగించిన కేసులో చాలామంది సెలబ్రిటీలకు సైతం పోలీసులు జరిమానా విధించారు. అయితే థార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

వీడియో చివరలో కూడా ఫుట్ పాత్ మీదకు మహీంద్రా థార్ వెళ్లడం, ఆ తరువాత భారీగా ట్రాఫిక్ ఉన్న రోడ్డుపైకి రావడం వంటివి చూడవచ్చు. అంతే కాకుండా ఆ సమయంలోనే ఒక ట్రక్కును ఆపి, రోడ్డుపైన కారును టర్న్ చేయడం వంటివి చూడవచ్చు. అంతటితో ఆగకుండా.. ఆ ట్రక్కు ముందరే కారును స్లో చేయడం కూడా చూడవచ్చు. అయితే చివరకు ఏం జరిగిందనేది వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారా? జరిమానా విధించరా? అనే విషయాలు తెలియడం లేదు. కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల పోలీసులు ఈ కారును గుర్తించడం కొంత కష్టంతో కూడుకున్న పని. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. మొత్తం మీద పబ్లిక్ రోడ్డుపైన ఇష్టానుసారంగా మహీంద్రా థార్ డ్రైవ్ చేసిన వ్యక్తిని గుర్తించడం కష్టమనే చెప్పాలి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, April 20, 2024, 18:59 [IST]
English summary
Mahindra thar driver reckless driving in public road
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+