కోళ్ల పందెంలో గెలిస్తే బహుమతిగా రూ.25 లక్షల మహీంద్రా థార్.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారిన ప్రకటన
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. సంసృతి, సాంప్రాదాయాలకు ప్రతిబింబంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, పండుగ సెలబ్రేషన్స్ ఆకాశన్నంటాయి. బ్రతకు దెరువు కోసం గ్రామాలను విడిచి పట్టణాలు బాట పట్టిన వారు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. విద్యార్థులకు కొద్ది రోజల ముందే సెలవులు ఇవ్వడంతో వారంతా ఇప్పటికే తమ స్వగ్రామాలకు చేరుకుని పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ భారీ ఎత్తున జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఇక్కడ కోడి పందాలు, ఎండ్ల బండి పందాలు, గుండాటలు జోరుగా నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈ 2025 సంక్రాంతికి ఏపీలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగ్స్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇది గత ఏడాది కంటే ఈ సారి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వచే గెస్ట్‌లకు ప్రత్యేక సీట్లను కూడా ఏర్పాటు చేశారు. సాధారాణ ప్రజలకు అలాగే, వీఐపీల పేరిట సీటింగ్ అన్ని బరులలో ఉంది. ఈ కోడి పందాల్లో గెలిచిన వారికి భారీ బహుమతులను ఇవ్వడానికి కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కోడి పందాల్లో గెలిచిన వారికి నిర్వాహకులు భారీ బహుమతిని ఇస్తామని ప్రకటించారు.

ఏపీలోని కాకినాడ జిల్లాలోని పెనుగుదురులో నిర్వహిస్తున్న కోడి పందాల పోటీలో గెలిచిన వారికి మహీంద్రా ప్రసిద్ధ మోడల్ థార్ రాక్స్ (Mahindra Thar Roxx)ను గిఫ్ట్‌గా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పుడు ఈ వార్త కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం థార్ రాక్స్ మోడల్ ధర రూ. 22.49 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర.
ఆన్‌రోడ్ అయితే దాదాపు రూ.25 లక్షల వరకు ఉంటుంది. ఇంత భారీ ధర కలిగిని కారును కోడి పందాల్లో బహుమతిగా ఇస్తున్నారంటే, అక్కడ పందాలకు ఎంత డిమాండ్ ఉందో తెలిసిపోతుంది. తెలిసిన వర్గాల సమాచారం ప్రకారం ఈ ఒక్క బరిలోనే దాదాపు రూ.5 కోట్ల వరకు పందాలు జరుగుతాయని తెలుస్తుంది. థార్ మాత్రమే కోన్ని ప్రాంతాల్లో గెలిచిన వారికి బుల్లెట్ బండ్లను కూడా ఇస్తామని ప్రకటిస్తున్నారు.
ఏలూరు జిల్లా పరిధిలో రామానుజపురంలో నిర్వహిస్తున్న కోడి పందాల్లో గెలిచిన వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించారు. పందాలను చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. బరుల చుట్టు కూడా ఒక మిని స్టేడియం మాదిరిగా ఉంది. లక్షలాది మంది ప్రజలు కోడి పందాలు, గుండాట, జూదం వంటి వాటిని చూడటానికి ఇప్పటికే చేరుకున్నారు.
మహీంద్రా ప్రసిద్ధ మోడల్ థార్ రాక్స్ విషయానికి వస్తే, ఇది ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న కారు. దీని కంటే ముందు థార్ విడుదల అయింది. ఇది లాంచ్ అయిన అనతి కాలంలోనే దేశంలో మంచి ఆదరణ సంపాదించింది. ఈ కారు 3 డోర్ ఆప్షన్‌లో వచ్చింది. దీనికి కొనసాగింపుగా 5 డోర్ థార్ రాక్స్ గత ఏడాదిలో విడుదల అయింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








